ప్రజల జీవనాడి అయిన పోలవరం రివర్స్ టెండర్ వేసినపుడే పట్టించుకుని… ఇదేం పద్ధతి అని మేధావులు ప్రజలు ప్రశ్నించి ఉంటే ఏపీ పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు.
అయ్యిందేదో అయిపోయింది. ఇపుడు అయినా ఉద్యోగులకు పౌరుషం వచ్చింది.
ఇతరుల కోసం పోరాడలేకపోయినా తమకోసం అయినా దమ్ముతో పోరాడుతున్నారు.
సీఎం ఏమైనా చేస్తాడేమో అన్న భయం వదిలేసి ఎదిరించి పోరాడుతున్నారు.
అయినా మరీ అన్యాయం కాకపోతే జీతం పెంచకపోతే పోయారు… తగ్గించడం ఏంటి?
ఒకవైపు కాళ్లు చేతులు అన్నీ సరిగా ఉండి పనిచేసుకుని బతికే వారికేమో ఉత్తినే గవర్నమెంటు డబ్బులు పంచిపెడుతూ ఉద్యోగాలు చేస్తున్న వారికేం డబ్బుల్లేవు అని చెప్పడం ఏంటి?
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం పనిచేసి కూలి అడుగుతున్నారు తప్పేముంది
ఉచితంగా పథకాలు తీసుకునేవారు ప్రజలకు ఏమీ పని చేస్తున్నారు.
గ్రామ సచివాలయంఉద్యోగుల పరిస్థితి మరింత దారుణం దయనీయం
పైగా… ఉద్యోగులకు ఏమి జీతాలు దొబ్బితింటున్నారు అంటూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎదురుదాడికి దిగడం ఏదైతే ఉందా అది పరాకాష్ట.
ఉద్యోగులపై నోటికొచ్చినట్లు మాట్లాడిన మంత్రి పేర్ని నానికి సూపర్ కౌంటర్ పడింది.
అది అక్షరాల్లో చదవడం కంటే ఈ వీడియో చూస్తే కరెక్టుగా అర్థమవుతుంది.
మాటలతో గారడీ చేసి పేర్ని నానిని ఇంతగా ఆడుకున్నవారు ఎవరూ ఉండకపోచ్చు.