అనుకున్న దానికి మించిన విజయాన్నిసొంతం చేసుకొన్న పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ తో పోలిస్తే.. బాలీవుడ్ లో పుష్పకు వచ్చిన కలెక్షన్లు అల్లు అర్జున్ కు కొత్త మార్కెట్ ను ఓపెన్ అయ్యేలా చేశాయి. ఈ నేపథ్యంలో తెలుగులో సన్సేషనల్ హిట్ గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను ఈ నెల 26న థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు రెఢీ అయ్యారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
పుష్ప ప్రభంజనంతోఅల్లు అర్జున అల వైకుంఠపురములో.. మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నాడు. తెలుగులో ఎంతో హిట్ అయిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ జనవరి 26న విడుదల కానుంది’ అని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి.. రాములా.. రాములా.. సామజవరగమన.. బుట్టబొమ్మ బుట్టబొమ్మ పాటలు ఎంతగానో ఆదరణ పొందటం.. ఈ పాటల్ని భాషలకు అతీతంగా వైరల్ కావటం తెలిసిందే. అయితే.. అల వైకుంఠపురం మూవీని ఇప్పటికే ‘షెహజాదాగా’ రీమేక్ అవుతోంది. బన్నీ పాత్రను కార్తీక్ ఆర్యన్.. పూజా హెగ్డే పాత్రను కృతి సనన్ చేస్తున్నారు. ఏక్తాకపూర్.. అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో టబు పాత్రను మనీషా కొయిరాల నటిస్తున్నారు.
అన్ని అనుకూలిస్తే ఈ రీమేక్ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు. కొవిడ్ నేపథ్యంలో హిందీ సినిమాలు విడుదల కాకపోవటం.. పెద్ద సినిమాలన్నీవాయిదా పడటంతో.. ఇప్పుడున్న వాక్యుమ్ లో సినిమాలులేని పరిస్థితి. ఇలాంటి వేళ.. పుష్ప మూవీతో బన్నీకి వచ్చిన క్రేజ్ ను సొమ్ము చేసుకోవటానికి వీలుగా.. అలవైకుంఠపురములో మూవీని డబ్ చేసి.. థియేటర్లలో విడుదల చేయటం ద్వారా బన్నీ మార్కెట్ ను మరింత విస్తరించాలన్న ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ మూవీకి.. రీమేక్ కు నిర్మాతలు ఒకే కావటం కలిసి వచ్చిందనే చెప్పాలి. మరి.. డబ్ వెర్షన్ కు ప్రేక్షకుల ఆదరణ ఏ తీరులో ఉంటుందో చూడాలి.