సంక్రాంతి పండక్కి తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంటికి వెళ్లిన నందమూరి బాలక్రిష్ణ.. సందడి సందడి చేస్తున్నారు. భోగికి ముందు రోజునే తన సోదరి ఇంటికి హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా కారంచేడుకు వెళ్లారు. ఆ రోజు నుంచి కారంచేడులోనే ఉంటున్నఆయన.. కుటుంబ సభ్యులతో.. బంధువులతో ఎంజాయ్ చేస్తున్నారు. శనివారం ఆయన కారంచేడు గ్రామంలో ఎడ్ల బండి మీదతిరిగారు. ఎడ్లబండిని సొంతంగా నడిపారు.
ఒంగోలు జాతి ఎద్దులతో ముస్తాబు చేసిన ఎడ్ల బండిని ఎక్కిన బాలయ్య.. అసలుసిసలు తెలుగు రైతు మాదిరి.. ఎడ్ల బండిని నడపటం అక్కడి వారిని ఎంతో ఆకర్సించింది. కారంచేడు వీధుల్లో ఎడ్లబండిని తిప్పిన బాలయ్యను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.ఎవరికి వారు బాలయ్య వస్తున్న వేళ.. ఇంటి బయటకు వచ్చి.. ఆయన్నుఆసక్తిగా చూడటం గమనార్హం. ఎడ్ల బండి మీద తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని కూడా కలుపుకొని గ్రామంలో తిరగటంతో.. కారంచేడులో పండుగ వాతావరణం పీక్స్ కు చేరిందని చెప్పాలి.
సోదరి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులతో.. బంధువులతో కలివిగాఉన్న బాలయ్య.. సంక్రాంతి రోజున గుర్రం మీద ఎక్కటం.. తన కుమారుడు మోక్షజ్ణతో కలిపి చాలాసేపు గడిపారు.అలంకరించిన గుర్రాన్ని తీసుకు రాగా.. దాని మీద కూర్చున్న బాలయ్య కాసేపు సందడి చేయగా.. తర్వాత దాని మీద తన కొడుకును కూర్చోబెట్టటం.. ఆ సందర్భంగా గుర్రాన్ని అదుపు చేసిన వైనం అందరిని ఆకట్టుకునేలా చేసింది.
అంతేకాదు…
సరదాగా వైఫ్ తో కలిసి బీచ్ లో రైడ్ ఎంజాయ్ చేశారు.
మొత్తానికి అందరికీ మంచి ఫన్ పంచారు.