తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి తనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు, తేలికపాటి లక్షణాలతో ఉన్నట్లు తన ట్విట్టర్లో ప్రకటించారు.
గత కొన్ని రోజులుగా తనను సంప్రదించిన ప్రతి ఒక్కరినీ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన అభ్యర్థించారు.
“నేను తేలికపాటి లక్షణాలతో కోవిడ్ బారిన పడ్డాను. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారు దయచేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి” అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశాడు.
ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు, ఆయన శ్రేయోభిలాషులు కోరుతున్నారు.
మూడు రోజుల క్రితం… పోలీసులు ఆయన ఇంటికి వచ్చి బాగా హడావుడి చేశారు. ప్రజాందోళన కార్యక్రమంలో రేవంత్ పాల్గొనకుండా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. సరిగ్గా అది జరిగిన మూడు రోజుల తర్వాత రేవంత్ కు కోవిడ్ రావడం గమనార్హం.