టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. జక్కన్న చెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో జక్కన్న మలిచిన ఈ భారీ మల్టీస్టారర్ మరో బాహుబలి కానుందని అంచనాలున్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ ట్రెండింగ్ లో ఉంది. ఇక, ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ అయిన ఆర్ఆర్ఆర్ ను వరల్డ్ వైడ్గా ఇంగ్లీష్, పోర్చు గీస్, కొరియన్, తుర్కిష్, స్పానిష్ భాషలతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో జనవరి 7న భారీస్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో రాజమౌళి, చరణ్, తారక్ లు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి తారక్, చెర్రీల న్యూ లుక్ ను చిత్ర టీం రిలీజ్ చేసింది.
డైనమిక్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చరణ్ లుక్ అదిరిపోయింది. ఇక, గోండుల ఆశాజ్యోతి కొమురం భీంగా ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన జక్కన్న అండ్ కో చెన్నైలోను ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగించారు. ఇక, త్వరలోనే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి ప్లాన్ చేస్తున్నారు.