కొద్ది నెలల క్రితం నేటి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మీద సీఎం జగన్ కులం అనే విషం కక్కుతూ నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే…నేడు ఏపీలో తొలిసారిగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటిస్తున్న సందర్భంగా ఆయనకు ఆహ్వానం పలుకుతూ జగన్ బ్యానర్ల మీద బ్యానర్లు కట్టారు. మన ముద్దు బిడ్డ, ఆంధ్రుడు, తెలుగు తేజం…అంటూ పొగడ్తలతో ముంచెత్తుతూ విజయవాడ రోడ్లను ప్రభుత్వం తరఫున జగన్ బ్యానర్లతో నింపేశారు.
దీంతో, ఆనాడు జగన్ చేసిన పనిని…ఈనాడు జగన్ చేస్తున్న భజనను పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. జగన్ ఎవరి మీదైతే విషం కక్కుతూ లెటర్ రాసారో, సంప్రదాయాన్ని కాలరాసి మరీ ఆ లేఖను మీడియాకు విడుదల చేసారో …నేడు ఆ న్యాయ దిగ్గజాన్నే ముద్దుబిడ్డ అంటూ జేజేలు పలుకుతూ స్వాగతించాల్సిన దుస్థితి పగోడికి కూడా రాకూడదు జగన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు రావడం దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ జగన్ అసెంబ్లీలో చాలాసార్లు ఎద్దేవా చేసిన విషయాన్ని కూడా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. సంవత్సరం మొత్తం కమ్మ..కమ్మ…అంటూ ఆయన మీద పడి ఏడ్చిన జగన్…సంవత్సరం చివర్లో అదే కమ్మోడికి రోడ్ల నిండా బ్యానర్లు కట్టాల్సిన దుస్థితి వచ్చిదని…ఇది దేవుడు రాసిన అసలుసిసలు స్క్రిప్ట్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ విషయం మాత్రమే కాదు..కులం ప్రాంతం అంటూ జగన్ పడి ఏడుస్తున్న ప్రతి విషయంలోనూ చివరకు జరగబోయేది ఇదే అంటూ నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. అందుకే, ఇకపై కొత్త సంవత్సరంనుంచైనా కులం, ప్రాంతం అని పడి ఏడవడాన్ని జగన్ ఆపుతారని కొందరు ఆశపడుతుండగా…..ఆపరని అందరి నమ్మకం అంటూ పోస్టులు పెడుతున్నారు.