దేశంలో కరోనా మహమ్మారిని అందరూ లైట్ తీసుకుంటున్నారు కానీ అది మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారినపడ్డారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టు చేయించానని, పాజిటివ్ వచ్చిందని ఆయనే వెల్లడించారు.
తాను బాగానే ఉన్నానని, డాక్టర్ల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని చెప్పారు. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నట్టు చెప్పారు. కొన్నిరోజులుగా తనను కలిసి వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.