ఆంధ్రప్రదేశ్ లో అనేక ఆలయాలు నేలమట్టం చేయడం వెనుక జగన్ ఉన్నారని తెలుగుదేశం బీజేపీ పార్టీలు గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ ఆరోపణ బలంగా చేయడానికి ఒక కారణం కూడా వారు చూపారు. అదేంటంట… చర్చిలపై దాడులు చేసిన వారిని గంటల్లోనే అరెస్టు చేసిన ప్రభుత్వం, ఆలయాలపై దాడులు చేసిన ఎవరినీ సరిగా అరెస్టు చేయకపోవడమే దీనికి రుజువు అని తెలుగుదేశం నేతలు అప్పట్లో పలుమార్లు ఆరోపించారు.
మరి ఏమందో ఏమో కొన్నాళ్లు వరుసగా ఆలయాలపై దాడులు జరిగిన అనంతరం అవి ఆగిపోయాయి.
తాజాగా జగన్ సర్కారును మరోసారి వివాదం చుట్టుముడుతోంది. తాజాగా క్మిస్మస్ సెలవులు, సంక్రాంతి సెలవులను జగన్ సర్కారు ప్రకటించింది. ఇందులో చూపిన తేడా వివాదాస్పదం అవుతోంది.
క్రిస్మస్ కు డిసెంబరు 23 నుంచి డిసెంబరు 31 వరకు జగన్ సర్కారు సెలవులు ఇచ్చింది
అంటే మొత్తం ఎనిమిది రోజులు సెలవులు.
సంక్రాంతికి జనవరి 10 నుంచి 15 వరకు సెలవులు ప్రటించింది జగన్ సర్కారు.
అంటే మొత్తం సెలవులు 6 రోజులు మాత్రమే.
అంటే ఒక్కరోజు జరుపుకునే క్రిస్మస్ పండుగకు 8 రోజులు సెలవులు ఇచ్చిన జగన్ ప్రభుత్వం, 3 రోజులు జరుపుకుని హిందువుల అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతికి కేవలం 6 రోజులు మాత్రమే సెలవులు ప్రకటించడాన్ని మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
ఏపీకి సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద పండగ. పైగా ఏపీలో హిందువులు 85 శాతం ఉన్నారు. మరి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మరి.