ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి వేసిన కమిటీ, ప్రభుత్వ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ రెడ్డి మాయలో పడి, మర్చిపోయిన కొన్ని అంశాలు కచ్చితంగా ఆలోచన చేయాలి.
గతంలో తెలంగాణా కంటే, ఎక్కువగా 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు చంద్రబాబు.
ఈ రెండున్నరేళ్ళలో జగన్ రెడ్డి, ఉద్యోగులకు ఏమి చేసాడు ?
అసలు అప్పట్లో చంద్రబాబు ఏమి చేసారు, ఇప్పుడు జగన్ రెడ్డి ఏమి చేస్తున్నాడో చూసి, ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ, మనసు పెట్టి ఆలోచించండి.
చంద్రబాబు మీకు మంచి చేసారా ? జగన్ రెడ్డి చేసారా ?
2014 లో చంద్రబాబు అధికారం లోనికి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులుకి చేసినవి :
1.రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ళకు పెంపు
2. విభజన కష్టాలు ఉన్నా 43 శాతం పీఆర్సీ
3.ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ కి రాష్ట్రపతి ఆమోదం
4. కంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులకు గ్రాట్యుటీ
5. కంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్
6. యెన్ టి ఆర్ వైద్య సేవలో ఉద్యోగులకి హెల్త్ కార్డులు జారీ
7. అంగన్వాడీ జీతాలు పెంపు
8. కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల 50 శాతం పెంపు
9. రాష్ట్ర కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులకు 5 రోజులు పని దినాలు
10. 2004 నుంచి 2018 మధ్య మరణించిన సీపీస్ ఉద్యోగుల కుటుంబాలు లో కారుణ్య నియామకం కి అర్హత లేని కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా మంజూరు
11. 2018 లో కొత్త పీఆర్ సీ వేయటానికి అంగీకారం
12. 2019 లో 20 శాతం ఐఆర్
13. 5 ఏళ్ళ కాలంలో ఇవ్వాల్సిన 10 డి.ఏ లు కి 8 డీఏ లు చెల్లింపు
14. అంతకు ముందు కిరణ్ కుమార్ ప్రభుత్వం లో ఆగిన రెండు డిఏలు చెల్లింపు
15. 2014-19 మధ్య మీ జీతాలు 100 శాతం పెరుగుదల
16. హోమ్ గార్డ్స్ జీతం 9000 నుండి 18000 కి పెంపు
17. VRA ల జీతం 6000 నుండి10500 కి పెంపు
18. అంగన్వాడీల జీతం 7100 నుండి 10500 కి పెంపు
19. ఆశా వర్కర్స్ కు 3 వేలు జీతం
20. RTC ఉద్యోగులకు 43% ఫిట్మెంట్
ప్రస్తుతం జగన్ రెడ్డి పాలనలో జరుగుతున్నది ఏమిటి ??
1. బయో మెట్రిక్ రద్దు చేస్తాం అన్నారు, రద్దు చెయ్య లేదు
2. పి ఆర్ సి గడువు పూర్తి అయ్యి మూడేళ్ళు అయ్యింది ( వాస్తవ గడువు 2018 జూలై ), ఏదో కంటి తుడుపు చర్యతో 14.29 శాతం ప్రకటించారు. మహా అయితే దీన్ని ఇంకొంచెం పెంచుతారు కానీ, చంద్రబాబు ఇచ్చినంత ఇవ్వలేరు
3. 2019 ఏప్రిల్ నుంచి ఇవల్సిన ఐ.ఆర్ 2019 జూలై నుంచి చెల్లింపు అనగా 3 నెలలు ఐ ఆర్ లేపేసారు
4. క్లాస్ 4 ఉద్యోగులకి 62 ఏళ్ళకు రిటైర్ మెంట్ అన్నారు ఇప్పుడు మౌనం వహించారు
5. వారంలో సీపీ ఎస్ రద్దు అన్నారు ఇప్పటి రద్దు చెయ్యలేదు..
6. ఉద్యోగుల గౌరవ ప్రతిష్ట లు కి భంగం కలిగే విధంగా వైన్ షాప్ లు దగ్గర డ్యూటీ లు, దొడ్లు కడగాటాలు
7. ఆర్ టి సి ఉద్యోగుల రా మీరు ప్రభుత్వ ఉద్యోగులు గా మారితే ప్రభుత్వ పించన్ వస్తోంది అని ప్రభుత్వం లో విలీనం అడిగారు . మీకు ఈ పి ఎఫ్ పించాన్ రద్దు అయ్యి ప్రభుత్వ పింఛను వస్తోందా ??
8. కరోనా కాలం లో పని చేసిన కాలానికి 50 శాతం జీతం రెండు నెలలు చెల్లించారు. గత 70 ఏళ్ళ పాలన లో ఇలా ఎప్పుడు అయిన జరిగిందా ??
9.టైంకి జీతాలు పడుతున్నాయా ?
10. సమయానికి పెన్షన్ పడుతుందా ?
11. సమయానికి బిల్స్ క్లియర్ అవుతున్నాయా ?
12. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమయానికి వస్తున్నాయా ?