బాలీవుడ్ స్టార్లు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల పెళ్లి ఇపుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
అతి తక్కువ మంది అతిథులతో రాజస్థాన్ లో జరుగుతున్న ఈ పెళ్లి గురించే ఇపుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది.
అయితే, తాజాగా తమను ఈ పెళ్లికి ఎందుకు పిలవలేదంటూ ఓ ప్రముఖ కంపెనీ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మాతో మీకు పనిలేదనుకుంటున్నారా అన్న అర్థం వచ్చేలా ఇన్ స్టా గ్రామ్ లో ఆ కంపెనీ చేసిన పోస్ట్ వైరల్ అయింది.
ప్రముఖ కండోమ్‌ల కంపెనీ డ్యూరెక్స్ కత్రినా-విక్కీలను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ ట్రెండ్ అవుతోంది.
నూతన వధూవరులకు విషెస్ చెబుతున్నట్టుగానే ఉన్న ఈ పోస్ట్ లో మరో అర్థం కూడా ఉంది.
పెళ్లి తర్వాత వెంటనే పిల్లలు కనాలనుకుంటున్నారా ఏంటి అన్న డబుల్ మీనింగ్ లో ఆ పోస్ట్ ఉండడంతో నెటిజన్లు నవ్విపోతున్నారు.
డియర్ విక్కీ, కత్రినా.. మీరు మమ్మల్ని పెళ్లికి పిలవలేదా..? మేం అస్సలు నమ్మలేకపోతున్నాం (Kidding)..? అన్న అర్థం వచ్చేలా కామెంట్ చేసింది.
ఈ Kidding అనే పదం ద్వారానే డ్యూరెక్స్ డబుల్ మీనింగ్ లో సెటైర్ వేసింది. (Kidding) అనే పదానికి ఒకటి నమ్మశక్యం కానిది అనే అర్థంలో వాడింది.
ఇక, రెండోది Kidding లో కిడ్స్ కావాలనుకుంటున్నారా…అందుకే మమ్మల్ని పిలవలేదా అన్నట్లు సెటైర్ వేసింది.