అఖండ సూపర్ సక్సెస్‌తో సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
మురళీకృష్ణ పాత్రలో అందంగా, మనోహరంగా ఎంతో వయసు తగ్గి కనిపించగా, అఖండ పాత్రలో భిన్నంగా కనిపించారు.
బాలకృష్ణను ఎలా ప్రెజెంట్ చేయాలో బోయపాటి శ్రీనుకు తెలుసు. సరిగ్గా గమనిస్తే… బోయపాటి దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లోనూ బాలకృష్ణ అందంగా కనిపించాడు.
దీనికి సంబంధించి ఒక కీలక సమాచారం తెలిసింది. బాలకృష్ణ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కోసం దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు చేశారట.
ఈ సినిమా కోసం కొన్న మూడు విగ్గుల ఖరీదే 39 లక్షల రూపాయలట.
సినిమాలో మురళీకృష్ణ పాత్రకు ఈ మూడు విగ్గులే ఉపయోగించారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ కోసం ముంబైకి చెందిన హెయిర్ స్పెషలిస్ట్‌ను నియమించారు.
ఈ హెయిర్‌స్టైలిస్ట్‌కు కేవలం డిజైన్స్ ఫైనల్ చేసినందుకే రూ. 12 లక్షలు చెల్లించారు.
మొత్తం మీద, మేకర్స్ ఈ సినిమా కోసం ఎందులోను రాజీపడలేదు.
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతకు లాభాలు పంట పండించింది.
వీకెండ్ లో బాక్సాఫీస్ దుమ్ముదులిపిన అఖండ… వీక్ డేస్ లో ను డీసెంట్ వసూళ్లనే రాబడుతోంది.