Payal Rajput Nipslip. Looks like purely intentional https://t.co/wDtEaWngZc
— Flash ⚡⚡ ᵛᵃˢᵗᵘⁿⁿᵃ (@Flashv07) November 29, 2021
ప్రచారం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే తీరు ఈ మధ్యన సినీ తారల్లో ఎక్కువైంది.
తాము చేసిన పనుల్ని సమర్థించేందుకు వారు చేస్తున్న వ్యాఖ్యలు హద్దులు దాటుతున్నాయి. క్రేజ్ కోసం పడే తపన.. సోషల్ మీడియాలో పాపులారిటీని పెంచుకోవటానికి వివాదాల్ని ఆశ్రయించటం.. తమ గురించి ఎక్కువగా మాట్లాడుకునేలా చేయటం.. ఏదో ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి వివాదాన్ని క్రియేట్ చేయటం.. దాన్ని సోషల్ మీడియాలో భారీ ఎత్తున కంటెంట్ జనరేట్ చేసేలా చేయటం ఈ మధ్యన కొందరికి ఒక అలవాటుగా మారింది.
తమ పేరు ప్రఖ్యాతుల కోసం జనాల ఎమోషన్స్ ను టచ్ చేసేలా చేయటం కోసం చేస్తున్న వారి ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో మిస్ ఫైర్ అవుతున్నాయి.
అలాంటప్పుడు పిడి వాదనను తెర మీదకు తీసుకొచ్చి.. తాను ఎంతలా స్పందించానన్న భావన కలిగేలా చేస్తున్నారు.
తాజాగా ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ ఫుత్ ఇలాంటి తీరునే ప్రదర్శించింది.
ఈ మధ్యనే తన హాట్ అందాల్ని ప్రదర్శించి.. అందరి చూపులు తన మీద పడేలా చేసేందుకు ఆమె ఓపెన్ టాప్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తెలిసిందే. దీనికి వచ్చిన రెస్పాన్స్ కు చెలరేగిపోయిన ఆమె.. ‘బి హైండ్ ది సీన్స్’ పేరుతో ఒక వీడియోను షేర్ చేసింది.
అందులో మోతాదు మించిన సీన్ ఉండటం.. దీన్ని గుర్తించకుండానే షేర్ చేసిన ఆమె.. ఆ వెంటనే తన తప్పును తెలుసుకొని ఆ వీడియోను డిలీట్ చేసింది.
అయితే.. అప్పటికే దాన్ని డౌన్ లోడ్ చేసుకున్న వారు.. దాన్ని అప్ లోడ్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారటం.. దీనిపై బోలెడన్ని నెగిటివ్ కామెంట్లు రావటం పాయల్ కు ఆగ్రహాన్ని తెప్పించింది.
అంతే.. తనపై వస్తున్న ట్రోల్స్ కు సమాధానం ఇచ్చేందుకు ఆమె నోటికి పని చెప్పింది.
‘ఇతర మహిళల వద్ద ఉన్నదే నా దగ్గర ఉంది. వారి వద్ద లేనిది కొత్తగా నా దగ్గర ఏం లేదు’ అంటూ బోల్డ్ కామెంట్లు చేసింది.
అయితే.. ఇలాంటి వ్యాఖ్యలకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చే వారుంటారన్న విషయాన్ని పాయల్ మర్చిపోయినట్లుంది. అందరి మహిళల వద్ద ఉన్నదే పాయల్ వద్ద ఉన్నప్పుడు.. కొత్తగా చూపించాల్సిందేముంది?
ఒకవేళ చూపించినప్పుడు దాన్ని డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది? అయినా.. మహిళల అందరివద్ద ఉన్నదే ఆమె దగ్గర ఉన్నప్పుడు.. అందరూ దాన్ని ఆమె మాదిరి చూపించే ప్రయత్నం చేయటం లేదు కదా? చేసింది తప్పుడు పని అయినప్పుడు దాన్ని సమర్థించుకోవటానికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం వల్ల నష్టమే తప్పించి.. లాభం ఉండదన్న విషయాన్ని పాయల్ ఎప్పటికి గుర్తిస్తుందో? పంచ్ కొటేషన్లు చెప్పగానే సరికాదు.. దానికి భారీ కౌంటర్లు కూడా ఉంటాయన్న చిన్న విషయాన్ని పాయల్ మిస్అయితే ఎలా?