బడ్జెట్ అప్పుల గురించే ఇంతవరకు కంగారు పడుతున్న ఏపీ ప్రజలకు పార్లమెంటు ద్వారా ఈరోజు కొత్త నిజం తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్రం స్వయంగా వెల్లడించింది. వీటికి ఆధారాలు కూడా చూపింది.
40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు బ్యాంకులు రుణాలిచ్చాయని తెలిపింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల వేసిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ ఈమేరకు జవాబిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ కు 2019-21మధ్య రెండు సంవత్సరాల్లో ఈ రుణాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.
అత్యధికంగా ఎస్బీఐ ₹11,937 కోట్ల రుణాలు ఇచ్చింది. రెండో స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ₹10,865 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹7 వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ₹2,970 కోట్లు, కెనరా బ్యాంక్ ₹ 4,099 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ₹7500 కోట్లు, ఇండియన్ బ్యాంక్ ₹ 5,500కోట్లు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ ₹1,750 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ₹5,633 కోట్లు, యూనియన్ బ్యాంక్ ₹6,975 కోట్లు ఏపీకి రుణాలు ఇచ్చాయి.
అంటే ఏపీ తన అప్పు పరిమితిని పూర్తిగా దాటేసింది. అందుకే ఎటు డబ్బులు దొరక్క వన్ టైం సెటిల్ మెంట్ స్కీమ్ అని, ప్రైవేటు వెంచర్ల వారు 5 శాతం భూమి ఇవ్వాలని ఇలా నేరుగా రాజరికంలో గుంజినట్లు బలవంతపు పన్నులు వేస్తోంది.
పరిస్థితి చూస్తుంటే మరో ఆరు నెలలు లేదా అంతకంటే ముందు ఏపీ ఆర్థిక బాంబు పేలేలా ఉందని అర్థమవుతోంది.