రామ్ గోపాల్ వర్మ…టాలీవుడ్ లో ‘శివ’తో ట్రెండ్ సెట్ చేసిన ఈ విలక్షణ దర్శకుడు కాలక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలతో మరో ట్రెండ్ సెట్ చేసి కాంట్రవర్షియల్ దర్శకుడిగా మారారు. కొందరైతే వివాదమే వర్మకు ముడిసరుకుగా మారిందని, పబ్లిసిటీ కోసమే ఇటీవల వర్మ సినిమాలు, కామెంట్లు ఉంటున్నాయని అంటున్నారు. ఏమీ లేని దాన్ని ఏదో ఉన్నట్టుగా చూపించడం…చివరకు ప్రేక్షకుడిని నిరాశ పరిచేలా షార్ట్ ఫిల్మ్ లను సినిమాలుగా చూపించే ప్రయత్నం చేయడం వర్మకు పరిపాటి అంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ‘పుష్ఫ’ ట్రైలర్ చూసిన వర్మ తన మార్క్ కామెంట్లతో మరోసారి కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఇటువంటి సినిమాల్లో రియలిస్టిక్ క్యారెక్టర్లను చేయడానికి ఏమాత్రం భయపడని ఒకే ఒక్క సూపర్ స్టార్ అల్లు అర్జున్ అని, ‘పుష్ప’ అంటే పుష్పం కాదని… అది ఫైర్ అని న్నీకి వర్మ కాంప్లిమెంట్లు ఇచ్చాడు. ఈ కాంప్లిమెంట్ తో ఆగితే ఆయన వర్మ కాడు…ఆయన చేసిన మరో కామెంట్ రాసే అవసరమూ వచ్చేది కాదు.
అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ తరహా పాత్రలను పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజనీకాంత్ తదితరులు చేయగలరా? అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు వర్మ. దీంతో, సోషల్ మీడియాలో వర్మపై సదరు హీరోల అభిమానులు కారాలు, మిరియాలు దట్టించి మరీ ఘాటుగా ట్రోలింగ్ చేస్తున్నారు. బన్నీని పొడడంలో తప్పులేదని, కానీ, తమ హీరోలపై కామెంట్లు చేయడం ఏమిటని మండిపడుతున్నారు.
ముఠా మేస్త్రి వంటి మాస్ సినిమాలతో పాటు స్వయంకృషి వంటి సినిమాలో చేసిన పాత్ర వరకు గతంలో చిరు ఎన్నో క్యారెక్టర్లు చేశాడని గుర్తు చేస్తున్నారు. ఏదైనా వర్మ కాంట్రవర్సీ కోసమే మాట్లాడుతుంటారని ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా ఆ అగ్రహీరోలపై వర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.