నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా హిట్ టాక్ తో థియేటర్ల దగ్గర మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అఖండ హంగామా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలోని ఓ థియేటర్లో అఖండ సినిమా చూస్తూ పూనకంతో ఊగిపోయారు బాలయ్య ఫ్యాన్స్. వారిని కంట్రోల్ చేసేందుకు రెండు సార్లు షో ఆపి మరీ పోలీసులు వచ్చి చెప్పి వెళ్లారంటే మూవీ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక, ఏపీలోని మెజారిటీ థియేటర్లలో అఖండ చిత్రం ప్రదర్శితమవుతోంది. ఈ రోజు తెల్లవారుఝామునుంచే చాలా చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా బెనిఫిట్ షోలకు అనుమతివ్వకపోవడంతో…ఎక్కడికక్
ఈ క్రమంలోనే నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రదర్శించిన సంఘమిత్ర ధియేటర్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ థియేటర్లో మ్యాట్నీ షోను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు, తెలంగాణలో అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో అగ్నిప్రమాదం జరిగింది. వరంగల్లోని జెమిని థియేటర్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రేక్షకులు పరుగులు తీశారు. షాట్ సర్క్యూట్ వల్లే ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు.