కమ్మ బూచిని చూపి 2019 ఎన్నికల పోరును కుల పోరుగా మార్చిన ఘనత వైఎస్ జగన్ రెడ్డిది. గుంటూరు, కృష్ణా జిల్లాలో మాత్రమే కనిపించే కులాల ఆధిపత్యాన్ని రాష్ట్రమంతటికీ అంటించి మనుషుల మెదళ్లను కలుషితం చేశారు జగన్ రెడ్డి.
కానీ ఆయన అధికారంలోకి వచ్చిన ఏడాదికే జనాలకు విషయం అర్థమైపోయింది. ఏపీలో జగన్ సామాజిక వర్గం జనాభా కంటే ఆ వర్గానికి ఇచ్చిన పదవులే అధికంగా ఉన్నాయని సెటైర్లు వేసే పరిస్థితి.
ఏపీలో అత్యధికంగా బీసీలు ఉన్నారు. కాపులు, కమ్మలు, రెడ్లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఏపీలో రెండ్లు 7 శాతానికి మించి లేరు. కానీ ప్రతి 10 పదవుల్లో 7 పదవులను జగన్ రెడ్లకే ఇస్తారు. కీలకమైన పదవులు అయితే వేరే వారిని నియమించే సమస్యే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
తాజాగా యూనివర్సిటీ వీసీ నియామకాలు చూసిన వారు అసలు జగన్ కులాభిమానం ఈ స్థాయిలో ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. కింద జాబితా చూస్తే మీరు షాక్ తినడం గ్యారంటీ. ఇప్పటికీ బాబుకు కులపిచ్చి అనే వారికి ఈ జాబితా షేర్ చేయండి.