ప్రముఖ తెలుగు కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అవయవాల వైఫల్యంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు.
కరోనా సోకడం వల్ల మూడు రోజుల క్రితం కొరియోగ్రాఫర్ శివశంకర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల సమాచారం ప్రకారం అతని ఊపిరితిత్తులలో 75 శాతం ఇన్ఫెక్షన్ సోకింది. ఎంతో ప్రయత్నం చేసినా అతనని వైద్యులు కాపాడలేకపోయారు.
అతని పెద్ద కుమారుడు విజయ్ కూడా వైరస్ బారిన పడ్డారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని . మరియు అతని భార్య సుగన్య హోమ్ క్వారంటైన్లో ఉందని వైద్యులు తెలిపారు.
విషాదం ఏంటంటే… వారి కుటుంబం ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికి చాలా కష్టపడుతోందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకుని సోనూసూద్, మెగాస్టార్ చిరంజీవి, తమిళ స్టార్ ధనుష్ కూడా స్పందించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
శివశంకర్ మాస్టార్ 1948లో చెన్నైలో జన్మించారు. 72 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన జాతీయ అవార్డు గ్రహీత. తెలుగు, తమిళం మరియు దక్షిణాదిలోని ఇతర చలనచిత్ర పరిశ్రమలలో డ్యాన్స్ మాస్టర్‌గా ప్రసిద్ధి పొందారు. టెలివిజన్ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించారు.