ఏదో మనసులో పెట్టుకుని ఏపీ సర్కారు సినిమా ఇండస్ట్రీపై పగ సాధిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను, మెగా ఫ్యామిలీని తొక్కడానికి జగన్ చేయని ప్రయత్నం లేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు వారిని కాపాడవయ్యా అంటే వారు చూసేందుకు సినిమా టిక్కెట్ రేటు తగ్గిస్తా అంటున్నాడు.
జగన్ ఎంత హింసించిన మూగదెబ్బలు తిన్న దొంగలు కుక్కిన పేనులా పడున్నారు సినిమా పెద్దలు. జగన్ కుట్ర రాజకీయాలను ఎంకరేజ్ చేసిన వారందరికీ జగన్ వల్లే నష్టం కలుగుతుండటం కర్మ సిద్ధాంతం అనే చెప్పాలి.
జగన్ నిర్ణయం గురించి స్పందించడానికి టాలీవుడ్లో అందరూ భయపడుతున్నారు. కానీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఘాటుగా స్పందించారు.
నువ్వేంటి నా సినిమాలు నిర్ణయించేది అన్నట్టు సురేష్ బాబు తన ప్రొడక్షన్స్‌లో నిర్మించిన ఇటీవలి కొన్ని చిత్రాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు.
ప్రతి దానికి ఒక ప్రత్యేక ధర ఉంటుంది. అన్నిటిని ఒకటే గాటన కట్టేయలేం. జగన్ ప్రభుత్వ నిర్ణయంతో సినిమా పరిశ్రమ మొత్తం దెబ్బతింటుందిన సురేష్ బాబు అన్నారు.
“మార్కెట్లో ప్రతి ఉత్పత్తికి ఒక ధర ఉంటుంది. అది డిమాండ్ అండ్ సప్లయ్ ఆధారంగా ఉంటుంది. భారీ బడ్జెట్ చిత్రాలను చూడాలని ప్రేక్షకులే కోరుకుంటారు. ప్రేక్షకుల కోరికకు తగ్గట్టు సినిమాలు తీయాలంటే ఖర్చు పెరుగుతుంది.
సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడం మూర్ఖత్వం. ఇది తెలివైన పని కాదు. బ్లాక్ టిక్కెట్లు మొదటి రెండు మూడు రోజులే ఉంటాయి. వాటని ప్రభుత్వం కంట్రోల్ చేసుకోవచ్చు.
ఏపీలో టిక్కెట్ ధరలతో థియేటర్ రెంట్ కూడా కట్టలేం. మన సినిమా పరిశ్రమను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎగ్జిబిషన్ పరిశ్రమ నాశనమై పోతుంది అని సురేష్ బాబు అన్నారు.