జగన్ పాలనలో అప్పుల ఊబిలో మునిగిన ఆంధ్రప్రదేశ్ పరువు జాతీయ స్థాయిలో మంటగలుస్తోందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకులు మొదలు కేంద్రం వరకు ఎవ్వరూ ఏపీకి అప్పించేందుకు సిద్ధంగా లేకపోవడంతో జగన్ పాలనపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక సంస్థ ఏపీకి అప్పివ్వొద్దంటూ రెడ్ నోటీసు జారీ చేయడం సంచలనం రేపుతోంది.
జగన్ కు వైద్య పరికరాల ఉత్పత్తిదారుల జాతీయ యూనియన్ (ఏఐఎంఈడీ) షాకిచ్చింది. తన అధికారిక వెబ్సైట్లో ఏపీ అప్పుల దుస్థితిని వివరిస్తూ ‘రెడ్ నోటీస్’ జారీ చేసింది. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖకు ఏ కంపెనీ అయినా వైద్య పరికరాలు సరఫరా చేసేముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించింది. ఆంధ్రాకు వైద్య పరికరాలు సరఫరా చేయాలనుకుంటే…అది ఆ కంపెనీ సొంత రిస్క్ అని, దానితో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.
దీంతో, జాతీయ స్థాయిలో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కాంట్రాక్టర్లకు, వైద్య పరికరాల సరఫరా సంస్థలకు, పంపిణీదారులకు జగన్ సర్కార్ దాదాపుగా 10 వేల కోట్ల రూపాయిలు బకాయి పడినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఏపీకి ఇంత కంటే పరువు తక్కువ విషయం మరొకటి ఉండదని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘‘అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ మెంబర్లు అందరికీ హెచ్చరిక! భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెం ట్ కార్పొరేషన్ (ఏపీఎంఎ్‌సఐడీసీ) ఆహ్వానించే పనుల్లో బిడ్లు దాఖలు చేయవద్దు. వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు. కంపెనీలు లేదా పంపిణీదారులకు వంద శాతం అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే సరఫరా చేయండి. యూనియన్ మెంబర్లు ఏపీఎంఎ్‌సఐడీసీకి సప్లయ్ చేసినవాటి బిల్లులు ఇప్పటికే ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ఇకపై సరఫరాలు ఆపేయాలి. అయినా.. వైద్య పరికరాలు సరఫరా చేయాలని ఏ కంపెనీ అయినా నిర్ణయిస్తే.. ఆర్థికంగా రిస్క్‌లో పడినట్లే అవుతుంది’’ అని రెడ్ నోటీసు జారీ చేసింది.