మిర్యాలగూడలో కొద్ది సంవత్సరాల క్రితం ప్రణయ్ పరువు హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ హత్య తర్వాత అమృతా ప్రణయ్ చాలాకాలం తర్వాత వర్మ దర్శకత్వం వహించిన `మర్డర్` చిత్రం నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆపాలని అమృత ప్రణయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా….చివరకు కొన్ని కట్ లతో ఆ సినిమా విడుదలైంది. ఇక, ఆ తర్వాత పెద్దగా మీడియా ముందుకు రాని అమృతా ప్రణయ్ తాజాగా ఓ వీడియో సాంగ్ లో యాక్ట్ చేయడం అందరికీ షాకిచ్చింది.
యాంకర్ లాస్య తాజాగా ‘దీపావళి’ సందర్భంగా స్పెషల్‌గా ఓ వీడియో సాంగ్‌ను రూపొందించారు. అయితే, ఈ వీడియోలో లాస్యతో పాటు అమృత ప్రణయ్ కూడా యాక్ట్ చేశారు. వీరిద్దరితోపాటు గలాటా గీతూ, అలేఖ్య వంటివారు కూడా ఈ పాటలో డ్యాన్స్ చేయడంతో ఆ పాట వైరల్ అయింది. దానికి తోడుగా చక్కని సాహిత్యంతో ‘దీపావళి’ స్పెషల్‌గా వచ్చిన ఈ వీడియో సాంగ్ ఇపుడు ట్రెండ్ అవుతోంది. ప్రణయ్ హత్య తర్వాత సైలెంట్ గా డిప్రెషన్ లో ఉన్న అమృత తాజాగా ఇలా వీడియో సాంగ్ లో నటించడం ఆమెకు రిలీప్ అని నెటిజన్లు అంటున్నారు.
ఈ విషయంలో క్రెడిట్ లాస్య మంజునాధ్ కు వెళుతుందని అంటున్నారు. లాస్య డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటే.. అమృత అప్పీయరెన్స్ ఈ వీడియోకు హైలైట్ గా నిలిచింది. ఈ వీడియో సాంగ్ త పాటు.. ఈ సాంగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోని కూడా విడుదల చేశారు. ఆ మేకింగ్ వీడియోలో అమృత తన అనుభవాలను తెలియజేసింది. ఈ సాంగ్ మేకింగ్ ఎలా జరిగిందో వివరించింది. ఏది ఏమైనా…చాలాకాలం తర్వాత అమృత స్క్రీన్ పై కనిపించడంతో ఈ వీడియో వైరల్ అయింది.