వైఎస్ హయాంలో మంత్రిగా ఉండి ఒక వెలుగు వెలిగిన రఘువీరా రెడ్డి ఇపుడు ఇంటికి పరిమితం అయ్యారు.
ఆయనను చూసిన సాధారణ ప్రజలు ఏమీ సంపాదించుకోలేదేమో పాపం లూనా మీద తిరుగుతున్నాడు. ఊర్లో రైతులా ఏ మంది బలగం లేకుండా ఊర్లో తిరుగుతున్నారు అనుకుంటు ఉంటారు.
కానీ కాంగ్రెస్ నేతలందరిలో చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఆయనే.
ఆయన ఇప్పటికీ వేల కోట్లకు అధిపతి అని స్థానికులు అంటుంటారు.
వాటన్నింటిని ఆయన సంతానం చూసుకుంటుందని… అవన్నీ బెంగుళూరులో ఉండటం వల్ల తెలుగు వారికి ఆయన గురించి తెలియక రాజకీయ సానుభూతి చూపిస్తున్నారని స్థానిక ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు.
ఎన్నికల సమయానికి ఆయన వ్యవహారం గుట్టు బయటపడుతుందంటున్నారు.
ప్రస్తుతం తన మనవరాలితో హాయిగా ఆడుకుంటున్న రఘువీరారెడ్డి తరచూ ఆ కబుర్లు నెటిజన్లకు చెబుతుంటాడు.
తాజాగా తాత తనతో ఆడుకోవడం లేదని మనవరాలు తాళ్లతో తాతను కట్టేసిందట.
ఆ ఫొటో ఇపుడు వైరల్ అవుతోంది.