ప్రేమించుకోవటం..కలిసి ఉండటం.. పెళ్లి చేసుకోవటం ఒకటి తర్వాత ఒకటి క్రమపద్దతిలో సాగుతాయి. పెళ్లి తర్వాత అనుకున్న జీవితం లేనప్పుడు.. భార్యభర్తల మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ చోటు చేసుకోవటం.. అనంతరం చికాకులు పెరిగిపోయి విడిగా ఉండే వరకు వెళ్లటం ఈ మధ్యన ఎక్కువైంది. సామాన్యులే కాదు సెలబ్రిటీల జీవితాల్లోనూ ఇలాంటివి ఈ మధ్యన ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తెలుగునాట హాట్ టాపిక్ గా మారిన చైతూ-సామ్ దాంపత్య జీవితానికి బ్రేకులు పడటం.. ఇరువురు విడిపోవాలని డిసైడ్ కావటం తెలిసిందే.
అనంతరం ఇరువురి మీద వచ్చిన వార్తలు తెలిసిందే. విడాకుల ఎపిసోడ్ తర్వాత నాగచైతన్య కామ్ గా ఉండిపోయాడు. తన సోషల్ మీడియా ఖాతాలోనూ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు. అందుకు భిన్నంగా సామ్ మాత్రం తరచూ ఏదో ఒక అప్డేట్ ఇస్తోంది. దీంతో.. అవి కాస్తా వార్తలుగా రావటం.. వాటి ఆధారంగా యూట్యూబ్ చానళ్లు తమకు తోచిన కథనాల వంట వండేయటం జరుగుతోంది.
ప్రముఖల వ్యక్తిగత విషయాల మీద సాధారణ ప్రజలకు ఉండే ఆసక్తి ఎక్కువన్నది తెలిసిందే. అలాంటప్పుడు అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు వీలైనంత మౌనంగా ఉండటం ఉత్తమం. ఆ విషయంలో సామ్ మాత్రం భిన్నంగావ్యవహరిస్తూ.. ఏదో ఒక పనితో వార్తల్లోకి వస్తున్నారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో నాగచైతన్యతో ఉన్న ఫోటోల్ని డిలీట్ చేయటం వార్తగా మారింది. ఇప్పటికిప్పుడే ఆ పని చేయకున్నా.. కాస్త ఆలస్యంగా చేసి ఉంటే కొంపలు మునిగిపోవు.
ఆమె నాగచైతన్యతో తన రిలేషన్ గురించి మర్చిపోవాలన్నదే ఆలోచన అయితే.. సోషల్ ఖాతాల్ని వాడకుండా ఉంటే సరి. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. ఫోన్ లో సోషల్ మీడియాకు సంబంధించిన యాప్ లను డిలీట్ చేస్తే ఒక పని అయిపోతుంది. అందుకు భిన్నంగా తన ఖాతాలో పోస్టులు చేయటం.. గతానికి సంబంధించిన ఫోటోల్ని డిలీట్ చేయటం ద్వారా.. ఎప్పటికప్పుడు ఏదో ఒక యాక్టివిటీతో ఆమె వార్తల్లోకి వస్తున్న పరిస్థితి. తాజాగా 80 ఫోటోల వరకు డిలీట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా ఆమె ఏమని చెప్పాలనుకుంటున్నారన్నది ఒక ప్రశ్నగా మారింది.
చైతూ రిలేషన్ ను మర్చిపోవాలన్న ఆలోచనతోనే ఆమె ఈ పని చేసినట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఓకే అయినా.. ఇప్పుడే ఎందుకు చేయటమన్న మాట వినిపిస్తోంది. తాజాగా ఫోటోల్ని డిలీట్ చేసిన సామ్.. నాగచైతన్యను ఆన్ ఫ్రెండ్ చేయటం.. ఆన్ ఫాలో చేయటం లాంటివి చేయలేదు. రేపొద్దున అది కూడా చేస్తే మరోసారి వార్తల్లోకి వచ్చే వీలుంది. కొంతకాలం పాటు ఏమీ చేయకుండా.. స్టేటస్ కో మొయిటైన్ చేస్తే సరిపోతుంది కదా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.