గడిచిన మూడు రోజలుుగా ఏపీలో రచ్చ రచ్చగా మారిన పట్టాభి మాట.. దానిని వైసీపీ బూతుగా చిత్రీకరించడం, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు.. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద జరిగిన దాడి తదితర ఉదంతాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు.
తెలంగాణలోనూ కొంత ప్రజాస్వామ్యం ఎక్కువైందని.. తనకు కొంతమంది మిత్రులు ట్విటర్ పెడుతున్నారన్నారు. ఏపీలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ బూతులేంది? ఇక్కడ ముఖ్యమంత్రిని పట్టుకుని మాట్లాడుతున్న భాషేమిటి? అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై ఎవరు దాడి చేశారన్నది పక్కన పెడితే.. దానికి మూలమేమిటి? రాజకీయాల్లో అంత అసహనం ఎందుకు? అంత అర్జెంట్ గా అధికారంలోకి వచ్చేయాలన్న ఆరాటం ఎందుకు? అని ప్రశ్నించిన కేటీఆర్.. రాజకీయాల్లో బూతు పురాణాన్ని..దారుణంగా తిట్టి పోయటం లాంటివి ఎవరు మొదలు పెట్టిందన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవటం గమనార్హం.
మరి మీ నాయన కేసీఆర్ పై బూతులు మాట్లాడినపుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అని తెలియదా… ఈ వీడియో చూడండి.
తెలుగు నేల మీద రాజకీయాల్లో ఇష్టారాజ్యంగా విమర్శలు చేయటం.. దారుణమైన రీతిలో తిట్లు తిట్టటం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే మొదలైందన్న విషయం అందరికి తెలిసిందే.
నచ్చినప్పుడు ఆకాశానికి ఎత్తేసే కేసీఆర్..కించిత్ తేడా వచ్చినా దారుణంగా తిట్టిపోయడం తెలిసిందే. ఎన్నో తిట్లు ఆయన పుణ్యమా అని ఇతర నేతలు నేర్చుకోవడం తో పాటు..వాటిని నిర్మోహమాటంగా ప్రయోగిస్తున్న వైనం ఎక్కువ అవుతోంది. అదేమంటే.. మరి.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడలేదా? అని ఎదురు ప్రశ్నిస్తున్న వైనం తెలిసిందే. అలాంటి హిస్టరీ తమ వద్ద ఉంచుకొని.. కేటీఆర్ ఎదురుదాడి వ్యాఖ్యలు చేయటం గమనార్హం.