వెండి తెర మీద ఆమె అందాల ప్రదర్శనతో వేడి పుట్టించే బాలీవుడ్ బ్యూటీల్లో ఒకరు నోరా ఫతేహి. తన ఆటపాటలతో యూత్ ను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తన గురించి ఓపెన్ గా మాట్లాడే అలవాటున్న ఆమె.. తాజాగా ఒక రియాల్టీ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
కెనాడాలో పుట్టిన ఈ 29 ఏళ్ల భామ.. తన పదహారేళ్ల వయసులో వెయిటర్ గా పని చేసినట్లు చెప్పింది. వ్యక్తిగత కారణాలతో తనకు పద్దెనిమిదేళ్ల వయసు వచ్చే వరకు తానువెయిటర్ గా పని చేశానని.. ఆ సందర్భంగా కస్టమర్ల తీరు ఇబ్బందిగా ఉండేదని చెప్పింది.
వెయిటర్ గా పని చేయాలంటే కాదు చాలానే గుణాలు ఉండాలన్న ఆమె.. కస్టమర్లతో బాగా మాట్లాడే సామర్థ్యంతో పాటు.. బాగా మెమరీ ఉండాలని చెప్పింది. అంతేకాదు.. ఓపిక.. సహనంలాంటివి కూడా అవసరమని పేర్కొంది.
కొన్ని స సందర్భాల్లో కస్టమర్లు చాలా దారుణంగా వ్యవహరిస్తాని.. అలాంటి సమయాల్లో మనం ఎలా ఉండాలన్న విషయాన్ని ఎవరికి వారు స్వతహాగా నేర్చుకోక తప్పదని చెప్పింది. ఇలా వెయిటర్ జాబ్ కు ఉండే ఇబ్బందుల్ని చెప్పి ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది.