రాజకీయాల్లో పాతుకోవడం అంత ఈజీ కాదు.. మహామహా నేతలే ఎన్నో డక్కామొక్కీలు తిని కిందా మీదా పడుతుంటారు. ఇక యువకులు నిలదొక్కుకోవడం సులభమేమీ కాదు. అందుకే రాజకీయ నాయకుల వారసులు తప్ప బయట నుంచి వచ్చే యువకులు రాజకీయాల్లో ఎదగడం చాలా తక్కువ. సమాజంలో మార్పు తెస్తామని సిద్ధాంతాలతో అడుగుపెట్టే యువకులు ప్రతికూల పరిస్థితుల కారణంగా సర్దుకుపోక తప్పదు. ఇప్పుడు తీన్మార్ టీమ్ కథ కం
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం కేసీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపడం కోసం జర్నలిస్ట్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఎంత దూకుడు ప్రదర్శించారో అందరికీ తెలిసిందే. ప్రతి విషయంలోనూ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తన క్యూ న్యూస్ ఛానెల్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు ప్రజల పక్షాల నిలబడి ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన విజయం సాధించలేకపోయినా అనూహ్య ఫలితాలు రాబట్టి ఆశ్చర్యపరిచాడు.
ఆ ఎన్నికలో ఫలితాల తర్వాత తీన్మార్ మల్లన్న మరింత దూకుడు పెంచారు. తనకు మద్దతుగా నిలిచే వాళ్లతో రాష్ట్రవ్యాప్తంగా తీన్మార్ మ
మల్లన్న బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో అది నచ్చని ఆయన టీమ్ సభ్యులు వేర్వేరు దారులు చూసుకుంటున్నారు. ఆ టీమ్‌లో నంబర్ 2గా కొనసాగిన మాజీ పోలీసు అధికారి దాసరి భూమయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో వంద మంది తీన్మార్ మల్లన్న టీమ్