అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా పదిమందికి సహాయము చేయాలనే సంకల్పంతో కువైట్లో ఎంతో మందికి ఆశ్రయం కల్పిస్తూ చంద్రబాబు వీరాభిమానిగా పార్టీకి సేవ చేస్తున్న ప్రముఖ తెలుగుదేశం బి.సి నాయకుడు శ్రీ ఎనుగోండ నరసింహులు గారి ఆధ్వర్యంలో కువైట్ లో ఉన్న బి.సి బడుగు బలహీన వర్గాలను ఏకతాటి మీదకు తెస్తు NRI తెలుగుదేశం కువైట్ బి.సి విభాగాన్ని ఏర్పాటుచేశారు.
అట్టహాసంగా జరిగిన లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ బి.సి. నాయకులు శ్రీ ఎనుగోండ నరసింహులు గారిని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.
శ్రీ ఎనుగోండ నరసింహులు గారు మాట్లాడుతూ తన గొంతులో ప్రాణమున్నవరకు పార్టీకి సేవలు అందిస్తామని తమ తల్లి లాగా పార్టీ కోసం ప్రాణాలు అర్పించటానికి అయినా సిద్దం అన్నారు. ఈ సందర్భంగా ఆయన వాళ్ళ అమ్మగారిని గుర్తుకు తెచ్చుకుని ఒక్కింత ఆవేశానికి గురయ్యారు.