ఒకరు ముఖ్యమంత్రి, మిగిలిన ఇద్దరు సినీ ప్రముఖులు. వయస్సు 60దాటింది. కరోనా గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు.
మాస్క్ పెట్టుకోవాలన్నారు. కానీ వీరు ముగ్గురు కలిసి నప్పుడు ఒక్కరూ మాస్క్ పెట్టుకో లేదు. బాలీవుడ్ లో అమితాబ్ కూడా ఇంతే. వీరిని అభిమానించే వారు, అనుసరించేవారు కూడా ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రాణాలు మీదకు తెచ్చుకుంటే ఎవరిది బాధ్యత.
ఏపీలో కూడా ఇంతే. మన సీఎం గారు ఎప్పుడో కానీ మాస్క్ పెట్టుకోరు. ఆయనను చూసి స్ఫూర్తి పొందారేమో తెలియదు కానీ అధికారులు మాస్క్ లు పెట్టుకోవడం మానేశారు. ఇందులో ఒకరో, ఇద్దరో మినహాయింపు ఉండవచ్చు. ,
ఇటువంటివి సమాజానికి ఎటువంటి సంకేతాలు ఇస్తాయో అర్థం చేసుకోవాలి.
ప్రజా ప్రతినిధులు, సిని ప్రముఖులు, అధికారులకు కరోనా వస్తే కోట్లు ఖర్చు పెట్టైనా ప్రాణాలు నిలుపుకోగలరు.
కానీ, బతుకుదెరువు కోసం, పనులు కోసం వీరిని కలిసిన వారికి కరోనా వస్తే దిక్కెవరు?
చివరిగా అర్ధమైంది ఏమిటంటే, వీళ్లకు కరోనా పట్ల వీళ్లకు అవగాహన లేదు, జాగ్రత్త లేదు, భయం లేదు. వీళ్లకు కరోనా కన్నా వేరే ఆలోచనలు ఉన్నాయి.