గడసరి కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న చిలిపి వేషాలకు ఫేమస్.
తెలుగులో అతి తక్కువ కాలంలో బాగా క్రేజ్ సంపాదించుకుంది
స్టార్ హీరోలతో ఛాన్సులు, అవి భారీ హిట్లు దీంతో పాప క్రేజు ఎక్కడికో పోయింది.
ఎలాంటి పాత్రలు అయినా ఓకే చెప్పేసే ఈమె పుష్ప లవర్ గా సుకుమార్ సినిమాలో నటించింది.
అల్లు అర్జున సరసన రష్మిక నటిస్తుండగా ఆ ఫస్ట్ లుక్ ఈరోజు వచ్చింది.
రష్మిక అచ్చం ఒక మొరటు పిల్లగా భలే ఉందా లుక్.
మనసైన వాడి కోసం రెడీ అవుతున్న అచ్చమైన పల్లెటూరి యువతి వేషంలో అందరిని మురిసిపోయేలా చేసింది
పట్టు రవిక వేసుకుని, చెవులకు దిద్దులు పెడుతూ కనిపిస్తోంది శ్రీవల్లి (రష్మిక). ఎదురుగా పట్టుచీర, మల్లెపూలు ఉన్నాయి. ఈ పల్లె పడుచు గెటప్‌లో చాలా అందంగా ఉందామె. గీతా గోవిందంలో క్లాస్ గా కనిపించిన ఆ అమ్మాయేనా ఈమె అన్నట్లు ఆశ్చర్యపరిచింది. మోడర్న్ గాళ్‌గా మాత్రమే కనిపించిన తనకి, ఈ సినిమాలో చేస్తున్న శ్రీవల్లి పాత్ర కచ్చితంగా ఓ డిఫరెంట్ ఫీల్ ఇవ్వనుందని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ ప్యాన్ ఇండియా రేంజ్లో రెండు పార్టులుగా తీస్తున్నారు. తొలి పార్ట్ క్రిస్మస్ కి రానుంది.