నిర్మాత బండ్ల గణేష్ మెగా ప్యామిలీ కోసం ఎంతకైనా తెగిస్తారని చెబుతుంటారు. ఆయన నిర్మాతగా నిలదొక్కుకోవడానికి మెగా కుటుంబమే ప్రధాన కారణమని సినీ వర్గాలు చెప్పే మాట. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆ కుటుంబానికి వీరాభిమాని.
ఇక జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అంటే బండ్ల గణేష్‌కు అమితమమై అభిమానమని అంటుంటారు. అంతేకాదు పవన్ మీద ఈగ కూడా వాలనీయడని ప్రచారలో ఉంది. ఇంతలా అభిమానాన్ని మూట కట్టకున్న గణేష్.. జనసైనికులకు ఏదైనా జరిగితే ఊరుకుంటారా? జనసేన నేతలను విడిపించుకోవడానికి బండ్ల పోలీస్ స్టేషన్ మెట్లెక్కినట్లు తెలుస్తోంది.
‘రిపబ్లిక్’సినిమా ప్రీరిలీజ్ పంక్షన్లో పవన్ మాట్లాడుతూ ఏపీ సర్కారుపై, వైసీపీ తీరుపై విరుచుకుపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడిన వాళ్లు… వైసీపీ రాగానే ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు? బోయలకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం లభించడంలేదు? ఇన్ని రకాల సమస్యలు పెట్టుకుని… సినిమా వాళ్లపైనే ఎందుకు మాట్లాడుతున్నారు?’’అని పవన్ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలోనే దర్శకుడు పోనాని మురళి రంగంలోకి దిగారు. జగన్‌కు కులపిచ్చి లేదని చెప్పారు. జగన్ అలాంటి వ్యక్తి కాదని పోసాని సమర్థించుకున్నారు. జగన్ అంటే తనకు అభిమానమని చెప్పారు. తాను చచ్చిపోయే వరకు ఆయనపై అభిమానం కొనసాతుందని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు, అన్యాయాలు జరిగితే ప్రశ్నిస్తే తప్పులేదని, వాటికి సాక్షాలు చూపించాలని నిలదీశారు. పవన్ రెమ్యునరేషన్‌పై ఇలా సినిమా, రాజకీయాల గురించి పోసాని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. దీంతో ఆయనను పవన్ అభిమానులు టార్గెట్ చేసి, బూతులు తిడుతూ ఫోన్‌కు మెసేజులు పెడుతున్నారంట. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోసాని ఈ రోజు కూడా మీడియాలో సమావేశంలో పవన్‌ను కడిగిపారేశారు.
పోసాని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వస్తున్నారన్న సమాచారం జనసేన నేత లక్ష్మణ్ తన అనుచరులతో వచ్చి నానా హంగామా చేశారు. పోసాని ప్రెస్‌మీట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కొద్దిసేపు ప్రెస్‌క్లబ్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పోసాని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్ష్మణ్‌తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం బండ్ల గణేష్ చెవిలో పడిన వెంటనే పంజాగుట్ట ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసినట్లు సమాచారం.
ఆయన జనసేన నేతలను విడిపించుకునేందుకు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏపీ ప్రభుత్వ పోర్టల్‌లో సినిమా టికెట్ల అమ్మకాల వ్యవహారంపై జనసేన వర్సెస్ వైసీపీగా మారింది.