హమ్మయ్య దేవుడి గుళ్లను పగలగొట్టిన విషయాన్ని అందరూ మరిచిపోయారు.
అనేక రకాల ఇష్యూలు మనం బాగానే డైవర్ట్ చేశాం అని సంబర పడుతున్న వైసీపీకి పవన్ షాకిచ్చాడు.
ఏపీలో జరిగిన ప్రగతి ఏదైనా ఉందంటే అది 140 ఆలయాలపై జరిగిన దాడులే అని పవన్ ఆరోపించారు.
అందునా ఆ దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం అని చురక వేశారు పవన్. ఈ రెండున్నర సంవత్సరాలు ఏపీలో జగన్ సాధించిన ప్రగతి ఇదే అని పవన్ విమర్శించారు.
ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!
హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? pic.twitter.com/cbfX4hI7bK— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021
జాతీయ స్థాయిలో ఇది చర్చనీయాంశం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ దీనిని తెలుగు, హిందీ భాషల్లో ట్వీట్ చేశారు. వాస్తవానికి ఏపీలో కేవలం ఆలయాలపై దాడులు మాత్రమే జరిగి ఉంటే అంత సీరియస్ టాపిక్ అయ్యేది కాదు.
ఒక వైపు ఆలయాలపై దాడులు
మరోవైపు ఆలయాల్లో ఛార్జీల పెంపు
ఇంకో వైపు చర్చిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయడం,
మరోవిషయం ఏంటంటే… హిందు ఆలయాలపై దాడి చేసిన దోషులను శిక్షించకపోవడం
ఇదంతా కాకుండా చర్చిలు కట్టడానికి ప్రభుత్వం తరఫున నిధులు విడుదల చేయడం
ఇలాంటి అరాచకాలతో ఏపీలో హిందువుల మనోభావాలను జగన్ సర్కారు గాయపరిచిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
జగన్ హిందు ద్వేషి అని చంద్రబాబు, తెలుగుదేశం వ్యాఖ్యానించింది. దానికి మద్దతు పలికేలా వినాయక నవరాత్రులను బ్యాన్ చేసిన జగన్ సర్కారు, తాజాగా దసరా నవరాత్రులపై నిషేధం విధించే ఆలోచనలో ఉంది. వీటన్నింటి నేపథ్యంలో పవన్ తాజా ట్వీటు వైసీపీని కార్నర్ చేసినట్టయ్యింది.