చిన్నప్పటి నుంచి ఆ అన్నాచెల్లెలు కలిసే పెరిగారు.. అన్న రాజకీయ భవిష్యత్ కోసం ఆ చెల్లి ఎంతో శ్రమించింది. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తన అన్న అధికారంలోకి రావడానికి కారణమైంది. కానీ అధికారం వచ్చిన తర్వాత అన్న తనను దూరం పెట్టడంతో తట్టుకోలేకపోయింది. పక్క రాష్ట్రానికి వెళ్లి సొంత పార్టీ పెట్టింది.
అన్నను ఇబ్బందుల్లో పెట్టే ప్రయత్నాలు మొదలెట్టింది. తన అన్న శత్రువుగా భావించే ఓ టీవీ ఛానెల్లో ఏకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. కుటుంబ విభేధాలను బయట పెట్టింది. ఇదంతా చదువుతుంటే ఆ అన్నాచెల్లెలు ఎవరూ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా! హా.. ఆ అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే ఆ చెల్లి వైఎస్ షర్మిల.
షర్మిల తన అన్నతో యుద్ధానికి కాలు దువ్వినట్లే కనిపిస్తున్నారు. జైల్లో ఉన్న తన అన్నను ముఖ్యమంత్రిని చేయడం కోసం మూడు వేల కిలోమీటర్లకు పైగా షర్మిల పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో పార్టీలో షర్మిలకు కీలక స్థానం దక్కుతుందని అంతా అనుకున్నారు.
ముఖ్యంగా వైసీపీలో జగన్ తర్వాత నంబర్ టూ స్థానం ఆమెదే అని అంతా భావించారు. కానీ జగన్ మాత్రం ఆమెను దూరం పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన షర్మిల ఇక్కడ ఏపీలో నేరుగా జగన్‌కు పోటీగా నిలబడడం ఇష్టం లేక తెలంగాణకు వచ్చి తన తండ్రి పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించారు. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా సాగుతున్నామని ఇక్కడ అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు.
అయితే షర్మిల జగన్ విభేధాలు చాలా సార్లు బయటపడ్డాయి. ఈ ఏడాది వైఎస్ జయంతి రోజైన జులై 8న ఇడుపులపాయలోని తన తండ్రి సమాధికి నివాళి అర్పించేందుకు ఈ అన్నాచెల్లెలు కలిసి వెళ్లలేదు. ఒకటి కంట ఒకరు పడకుండా వేర్వేరుగా వెళ్లి వచ్చారు. ఆ తర్వాత రాఖీ పండగ రోజు కూడా షర్మిల తన అన్నను కలవలేదు.
వైఎస్ వర్థంతి రోజైన సెప్టెంబర్ 2న ఈ ఇద్దరు కలిసే తన తండ్రికి నివాళ్లు అర్పించినప్పటికీ నేరుగా మాట్లాడుకోలేదు. దీంతో వీళ్లిద్దరి మధ్య విభేధాలు తీవ్ర స్థాయిలోనే ఉన్నాయని అర్థమైంది. ఇప్పుడిక షర్మిల తాజాగా ఓ మీడియా ఛానెల్లో ప్రసారమయ్యే కార్యక్రమానికి గెస్ట్‌గా హాజరై ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబ విభేధాలను ఆమెను బయట పెట్టినట్లు సమాచారం.
జగన్‌కు ఈ మీడియా సంస్థ అంటే పడదనే సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై పత్రికలో టీవీలో ఈ మీడియా సంస్థ విమర్శిస్తునే ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఈ నేపథ్యంలో జగన్‌ను విమర్శించే మీడియా సంస్థలో షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య విభేధాలను స్పష్టం చేస్తున్నాయి.
ఆ మీడియా సంస్థకు షర్మిల వెళ్లారంటేనే జగన్‌కు టార్గెట్ చేయడం కోసమేనని విషయం తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్‌లో వీళ్ల మధ్య విభేధాలు ఇంకా ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి. కానీ ఓ మీడియా సంస్థ సాక్షిగా కుటుంబంలోని విభేధాలను షర్మిల బయటపెట్టడం వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారన్న