ఏపీ విద్యాశాఖ మంత్రి.. సీఎం జగన్‌కు అత్యంత ప్రియమైన నాయకుడు.. ఆదిమూలపు సురేష్ దంపతుల కు సీబీఐ షాకివ్వనుంది. అంతేకాదు.. సుప్రీం కోర్టు కూడా ఈవిషయంలో సీబీఐకి అనుకూలంగానే తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తోందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కనుక జరిగితే.. ప్రజా ప్రతినిధిగా ఆయన అనర్హుడయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ విషయం వైసీపీలో ఆసక్తిగా మారింది.
విషయం ఇదీ..
రాజకీయాల్లోకి రాకముందు.. సురేష్ ఐఆర్ ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీస్)లో పనిచేశారు. అదేవిధంగా ఆయన సతీమణి విజయలక్ష్మి.. కూడా ఐఆర్ ఎస్ అధికారి. అయితే.. ఉద్యోగానికి మధ్యలోనే వీఆర్ ఎస్ ఇచ్చేసి.. కాంగ్రెస్ అప్పటి నాయకుడు.. వైఎస్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు ఆదమూలపు. దీంతో ప్రకాశం జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున 2009లోనే ఆయన విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. వైసీపీలోకి వచ్చారు. 2014లోను, తర్వాత.. గత ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఇప్పుడు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.ఇ క, ఆయన సతీమణి మాత్రం ఐఆర్ ఎస్‌గా ఉన్నారు.
ఏం జరిగింది?
ఆదిమూలపు దంపతులపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఎఫ్ ఐఆర్ కూడా రెడీ చేశారు. దీనికి కారణం.. 2015-16 మధ్య కేంద్ర ప్రభుత్వం.. సివిల్ సర్వెంట్ల ఆదాయంపై విచారణ కు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఐఆర్ ఎస్, ఐపీఎస్ అధికారులకు(ఆరోపణలు వచ్చిన) నేరుగా సీబీఐ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో మన రాష్ట్రంలో విశాఖ, విజయవాడ సహా..పలు జిల్లాల్లో విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఆదిమూలపు దంపతుల ఆదాయంపై విచారణ చేసిన సీబీఐ.. ఉద్యోగ కాలంలో వీరిద్దరూ అవినీతికి పాల్పడ్డారని.. ఆదాయానికి మించి.. 4 కోట్ల రూపాయలను పోగేశారని.. అదేవిధంగా హైదరాబాద్ సహా.. ఇతర ప్రధాన నగరాల్లో స్థలాలు, విల్లాలు కూడా కొనుగోలు చేశారని గుర్తించి.. వాటి ఆధారంగా కేసు నమోదు చేసింది.
తర్వాత ఏమైంది..
సీబీఐ కేసు నమోదు చేసి.. ఎఫ్ ఐఆర్ కట్టి రేపోమాపో.. చార్జిషీట్ దాఖలు చేస్తుందనగా.. ఆదిమూలపు దంపతులు గుట్టుగా తెలంగాణ హైకోర్టులో ఎఫ్ ఐఆర్ రద్దు కోరుతూ.. పిటిషన్ వేశారు. ఎలాంటివిచారణ చేపట్టకుండానే సీబీఐ.. తమపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసిందని.. పేర్కొన్నారు. దీనిని విచారించిన.. హైకోర్టు సింగిల్ జడ్జి.. జస్టిస్ కే. లలిత సీబీఐ నమోదు చేసిన ఎఫ్ ఐఆర్‌ను కొట్టేసింది. దీంతో సీబీఐ.. ఈ విషయంపై సుప్రీంకు వెళ్లింది. అక్కడ రెండు దఫాలుగా విచారణ జరిగింది. తాజాగా విచారణ పూర్తి చేసిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. సీబీఐ హ్యాండ్ బుక్ మేరకు తాము వ్యవహరించామని సీబీఐ ససుప్రీం కోర్టుకు తెలిపింది. అంతేకాదు.. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకునే కేసు పెట్టామని పేర్కొంది.
ఏం జరుగుతుంది…
వాస్తవానికి ఇప్పటికే.. సీబీఐ విచారణ ఆపాల్సిన అవసరం లేదని.. సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రెండో దఫా జరిగిన విచారణలో ఫ్రష్‌గా కేసు నమోదు చేసి.. కేసు పెట్టాలని.. చెప్పింది తప్ప.. పూర్తిగా కేసు కొట్టేయాలని చెప్పలేదు. అదేసమయంలో ఆదిమూలపు దంపతులకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. సో.. దీనిని బట్టి.. తీర్పు రిజర్వ్ చేసినా.. సుప్రీం నుంచి ఆదిమూలపు దంపతులకు షాక్ ఖచ్చితమేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇదేజరిగి.. అవినీతి కనుక రుజువు అయితే.. ప్రజాప్రతినిధిగా ఉన్న ఆదిమూలపు సభ్యత్వం రద్దవుతుందనిన్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి సుప్రీం ఏం చెబుతుందో చూడాలి.