తెలంగాణలో పార్టీలు ఎక్కువ కావడంతో విమర్శలు ప్రతివిమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎంట్రీతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది.
రేవంత్ రెడ్డి ఎంట్రీ తర్వాత తాము అధికారంలోకి రాగలం అన్న భరోసా కాంగ్రెస్ క్యాడర్ లో కనిపించింది. దీనిని ఎలాగైనా అధిగమించి మళ్లీ సీఎం కావడానికి కేసీఆర్ వేసిన పరోక్ష ఎత్తులే షర్మిల పార్టీ.
షర్మిల వెనుక ఉన్నది కచ్చితంగా కేసీఆరే అన్న అనుమానాలు అనేకమందిలో ఉన్నాయి. జగన్, కేసీఆర్ ఒప్పందంలో భాగంగానే తెలంగాణలో షర్మిల ఎంట్రీ జరిగిందని జనాలకు తెలిసిపోయిన నేపథ్యంలో కవర్ చేసుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ఆపాసోపాలు పడుతోంది.
గట్టి విమర్శలు చేయడం ద్వారా చీకటి బంధాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. అయినా జనం నమ్మరు. జనానికి వీరి బంధంపై చాలా క్లారిటీ ఉంది. తాజా టీటీడీ ఘటనే దీనికి ఉదాహరణ.
నీటి వివాదంలో వైఎస్ ని, జగన్ ని అనేక తిట్లు తిట్టిన కేసీఆర్ ది ఉత్త నాటకం అంటే ఆరోజు ఎవరూ పెద్దగా నమ్మలేదు. కానీ సడెన్ గా కేసీఆర్ ఆత్మ అయిన మై హోం రామేశ్వరరావు టీటీడీ బోర్డులోకి ఎంట్రీ ఇచ్చాక వాస్తవాలు అందరికీ అర్థమయ్యాయి.
అందుకే మరోసారి షర్మిలను విమర్శించడం ద్వారా దీనిని కవర్ చేసుకోవడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు.
వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, బీఎస్సీ నేత ప్రవీణ్ కుమార్ లు జాతీయ పార్టీలకు తొత్తులని కేటీఆర్ విమర్శించారు.
తిట్టడం కూడా ఎంత సాఫ్ట్ గా తిట్టారో చూశారా… రేవంత్ ని తిట్టేటపుడు గాడిద అడ్డగాడిద అంటాడు..అదే షర్మిలను తిట్టేటపుడు రొటీన్ గా తొత్తులు అదీ ఇదీ అంటారు.