బిగ్ బాస్ కార్యక్రమంపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ ను ఆయన ఓ బ్రోతల్ స్వర్గం లాగ, రెడ్ లైట్ ఏరియా సంస్కృతి అంటు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.
విదేశీ సంస్కృతిని తీసుకొచ్చి బిగ్ బాస్ అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మన సమాజాన్ని చెడగొట్టేస్తున్నారంటూ నారాయణ మండిపోయారు. ఈ కార్యక్రమాన్ని నిలిపేయాలంటూ తాము కోర్టులో కేసు వేయబోతున్నట్లు కూడా చెప్పారు.
బిగ్ బాస్ కార్యక్రమం బ్రోతల్ స్వర్గం కాబట్టే ఆ కార్యక్రమాలను నిర్వాహకులు 24 గంటలు లైవ్ రిలే చేయడం లేదని కూడా తన ఆరోపణలను సమర్ధించుకున్నారు. జనాలకు కార్యక్రమాలను కేవలం ఎడిట్ చేసినవి మాత్రమే ఎందుకు చూపిస్తున్నట్లు నారాయణ వేసిన ప్రశ్నకు నిర్వాహకులు సమాధానం చెప్పాల్సిందే. నిజానికి బిగ్ బాస్ కార్యక్రమంపై జనాల్లో ఏమీ సానుకూల స్పందన లేకపోయినా నారాయణకు ఉన్నంత వ్యతిరేకత కూడా లేదన్నది వాస్తవం.
కార్యక్రమంలో భాగంగా యువతీ, యువకులను 105 రోజుల పాటు ఒకే గదిలో ఉంచుతున్నారంటు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారు బహిరంగంగానే ముద్దులు పెట్టేసుకుంటున్నారని, కౌగలించుకుంటున్నట్లు నారాయణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
కార్యక్రమం పేరుతో 105 రోజులు జరుగుతున్నది కేవలం డేటింగ్ మాత్రమే అంటూ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన కంటెస్టెంట్ల ప్రవర్తనపై జనాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన విషయాన్ని నారాయణ గుర్తుచేశారు.
బిగ్ బాస్ కార్యక్రమం పేరుతో నిర్వాహకులు మన సంస్కృతిని నాశనం చేస్తున్నారన్న నారాయణ వ్యాఖ్యలను జనాల్లో కొందరు ఇప్పటికే సమర్ధిస్తున్న విషయం గమనార్హం. విదేశీ సంస్కృతిని మన దగ్గర పెంచి పోషించాల్సిన అవసరం లేదన్న నారాయణ వ్యాఖ్యలు ఆలోచించాల్సిందే.
ఇప్పటికే మన సమాజంలో అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బిగ్ బాస్ లాంటి కార్యక్రమాల ప్రభావం యూత్ మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి తాజాగా నారాయణ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వాలు స్పందిస్తాయా ? వెయిట్ చేసి చూడాల్సిందే.