అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు అలా సరదాగా బయటకు వెళ్లి మూల మీద ఉన్న టీకొట్టులో టీ తాగాలని ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛ ఉండదు.
కొన్ని చిన్న చిన్న కోరికలు అలా మిగిలిపోతాయంతే అంటాడు.
పాపం అలాంటి చిన్న కోరిక ఒకటి తీర్చుకునే సమయం దొరికింది అల్లు అర్జున్ కి.
ఐకాన్ స్టార్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ఫ’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆ షూటింగ్ కోసం బన్నీ కాకినాడ వెళ్లాడు.
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మీదుగా వెళుతు రోడ్డు పక్కన ఉన్న ఓ పాక హోటల్లో ఆగి టిపిన్ చేశాడు.
బడా హీరో ఇలా తమ హోటల్ కి టిఫిన్ రావడంతో ఆ యజమాని తెగ సంతోషపడ్డాడు.
బన్నీ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సింప్లిసిటినీ తెగ పొగిడేస్తున్నారు.
ఇదంతా ఒకెత్తు అయితే… టిఫిన్ చేసిన డబ్బులు అల్లు అర్జున్ డబ్బులు ఇవ్వబోతే… అలా చేయకు, డబ్బులు తీసుకోండి అని బలవంతంగా అతనికి డబ్బులు ఇచ్చారు అల్లు అర్జున్.
అంతేకాదు, యజమాని ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత, అల్లు అర్జున్ హైదరాబాద్లో ఉద్యోగం పొందడానికి సాయం చేస్తానని, ఎపుడైనా రావచ్చు, నీకు ఉద్యోగం ఇప్పించడం నా బాధ్యత అని అల్లు అర్జున్ ప్రామిస్ చేశాడట.
అతని మనసుకు హోటల్ యజమాని ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప: ది రైజ్ (పార్ట్ 1) క్రిస్మస్ రోజున (డిసెంబర్ 25) న థియేటర్లలోకి రానుంది.