చిరంజీవి మేనల్లుడు టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఘోర ప్రమాదానికి గురయ్యారు.
దుర్గం చెరువు మీదకు స్పోర్ట్స్ బైక్ మీద వేగంగా రావడంతో ఆయన ఈ ప్రమాదం బారిన పడ్డారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కేబుల్ బ్రిడ్జి తర్వాత కోహినూర్ హోటల్ వద్ద స్కిడ్ అయిన బైక్ వల్ల వేగంగా కింద పడ్డాడు.
ఈ ప్రమాదంలో కడుపు, ఛాతీ, కుడికన్ను పై గాయాలు అయ్యాయి.
ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారు.
ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్ తేజ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే, బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా? అన్న అనుమానంతో పరీక్షలు చేస్తున్నారు.