ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాన్ని రోడ్డున జగన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కులం లెక్కలు వేసుకుని కూచుంటున్నారని ఘాటు వ్యాఖ్యలతో విమర్శలు చేశారు.
వ్యాక్సిన్ కు కులం అంటగట్టిన ఈ పెద్దమనిషి దేశంలో వ్యాక్సినేషన్లో అట్టడుగున నిలిచారన్నారు. జగన్ కులపిచ్చితో వ్యాక్సిన్ కంపెనీపై ఏడుస్తున్నారు, మిగతా 27 రాష్ట్రాలలో వ్యాక్సిన్ కి తగలని కులం ఆంధ్రాలో అంటించిందెవరని నిలదీశారు.
తాడేపల్లి కొంపలో ఇంట్లో ముడుచుకొని నిద్రపోతున్నారంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అధోగతికి పయనిస్తోందన్నారు. ఎవరెలా చస్తే నాకేంటి తాడేపల్లి కొంపలో నేను హాయిగా నిద్రపోతే చాలు అన్నట్టు ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అన్నారు లోకేష్.
జగన్ రెడ్డి గారి పాలన వల్ల అధోగతిలో అగ్రస్థానం..ప్రగతిలో చిట్టచివరి స్థానంలో ఉంది రాష్ట్రం. ఎవరెలా చస్తే నాకేంటి తాడేపల్లి కొంపలో నేను హాయిగా నిద్రపోతే చాలు అన్నట్టు ఉంది @ysjagan గారి వ్యవహార శైలి.(1/3) pic.twitter.com/YiQgLJNRob
— Lokesh Nara (@naralokesh) September 4, 2021