రాజ్యసభ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. నరసాపురం ఎంపీ రఘురామ రాజు సాయిరెడ్డిని తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. ఇదేదో పెళ్లి ఆహ్వానమో, విందు ఆహ్వానమో కాదు… రాజకీయ ఆహ్వానం.
విజయసాయిరెడ్డి వైసీపీ అసలు విషయం తెలుసుకోకుండా భ్రమల్లో బతుకుతూ పిచ్చి కామెంట్లు చేస్తున్నారన్నారు. జగన్ బిక్షతో దొడ్డిదారిన ఎంపీ అయింది నువ్వు. జనంతో ఓట్లు వేయించుకుని ఎంపీ అయిన వ్యక్తిని నేను. ఎందుకో పార్టీలోనే నన్ను ఉంచుకోవాలి అనుకుంటున్నారు, అందుకే బహిష్కరించడం లేదు. నేను ప్రేమించే పార్టీలో ఉండటం నాకూ ఇష్టమే అన్నారు.
ఇకపోతే వైసీపీ తాజా పరిస్థితిపై రఘురామ పలు కామెంట్లు చేశారు. ఏపీలో తన సర్వేలో 50 మంది మాత్రమే నెగ్గుతారని తేలిందని అన్నారు. తన సర్వేకు సంబంధించి సైంటిఫిక్ ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.
నా సర్వేలు నాకు తెలుసు, విజయసాయిరెడ్డి దగ్గర సర్వేలు కూడా నాకు తెలుసు. పనికిమాలిన అబద్ధాలు చెబితే అపహాస్యం పాలయ్యేది ఆయనే. నా దగ్గరకు వస్తే తన సర్వేలు, వాటికి ఆధారాలు చూయిస్తాను. సీఎం చేయించిన సర్వేలు నీకు దొరికితే తీసుకురావాలి.. లేకపోతే అవి కూడా నా వద్ద ఉన్నాయి. చూపిస్తాను. తన ఇంటికి రావాలి. వస్తే అన్నీ చూపిస్తాను విజయసాయిరెడ్డిని తన ఇంటికి ఆహ్వానించారు.