ఎవరితో పెట్టుకునే ముందు వాడెవడో విచారించుకోవాలి కదరా అంటూ ఒక సినిమా డైలాగ్ ఉంది.
పాపం రఘురామరాజుతో పెట్టుకున్నవారికి తర్వాత్తర్వాత ఈ డైలాగ్ గుర్తుకువచ్చి కుమిలిపోతున్నారు.
ఎందుకబ్బా ఇతనితో గొడవ పెట్టుకున్నాం అని మదనపుడతున్నారు.
పులి మీద స్వారీలా ఉంది వారి పరిస్థితి. ఎంతో కాలం స్వారీ చేయలేరు. కిందకు దిగితే పులి తినేస్తది. చావో రేవో అన్న పరిస్థితి ఉంది.
రఘురామరాజు ఏ విషయాన్ని ఆషామాషీగా తీసుకోవడు, అతను దేనికైనా కోపాన్ని ఆశ్రయించడు, కోర్టును ఆశ్రయిస్తాడు. రాజ్యాంగాన్ని, ఐపీసీని ఫుల్ గా వాడేస్తాడు.
తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగంపై రఘురాముడికి ఉన్న పట్టు మరెవ్వరికీ లేదు.
అంతేకాదు, తనపైకి వచ్చిన వారిని ఐసీపీ సెక్షన్లతో, సాక్ష్యాలతో ఎలా ఇరికించాలో కూడా అతనికి బాగా తెలుసు. పాపం సాయిరెడ్డి ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు. ఇపుడు ఆ వీడియో ఆధారంగా మరోసారి సాయిరెడ్డిని బుక్ చేయడానికి రఘురామరాజు రెడీ అయిపోయారు. చూద్దాం ఏం జరుగుతుందో!
యథా నేతలు..తథా కార్యకర్తలు అనేలా వుంది వైకాపా 32 కేసుల్లో A1 వుంటే వైకాపా వలంటీర్లు అవినీతిలో ఆరితేరిపోయారు. వలంటీర్లలో 90 శాతం మంది వైసీపీ కార్యకర్తలేనని A2 తేల్చితే.. వలంటీర్లంతా కరెప్షన్కి అలవాటుపడ్డారని వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి కుండబద్దలుకొట్టారు. pic.twitter.com/qi7AvWooVv
— Maddina Eswar Naidu (@Eswarnaidutdp) August 27, 2021