దేశంలో చాలామంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు.కానీ.. మరెవరికీ లేని స్టార్ ఇమేజ్.. పోలీసు శాఖలో ప్రత్యేక గుర్తింపు.. నిజాయితీ ట్యాగ్.. ఇచ్చిన టాస్కును పూర్తి చేయటం మాత్రమే కాదు.. దారుణ నేరం జరిగినప్పుడు ప్రజలు భావోద్వేగంతో ఊగిపోతున్నప్పుడు.. వారు కోరినట్లుగా.. వారు మెచ్చేట్లుగా నిర్ణయాలు తీసుకోవటం సజ్జన్నార్ కు మాత్రమే సాధ్యమని చెబుతారు.
గతంలోనూ.. సైబరాబాద్ సీపీగా ఉన్న వేళలోనూ తన మార్క్ ఏమిటో చూపించారు. అన్నింటికి మించిన దిశ ఎపిసోడ్ లో ఆయన తీరును మానవహక్కుల నేతలు లాంటి కొందరు మినహా.. ఆయన నిర్ణయాన్ని చాలామంది అభినందించటమే కాదు.. దీపావళి.. దసరా పండుగలు కలిపి వస్తే.. ఎలా ఉంటుందో.. అలాంటి పండుగ
వాతావరణం ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు.. యావత్ దేశం చేసుకునేలా చేసిన సత్తా సజ్జన్నార్ సొంతం.
కర్ణాటకకు చెందిన ఆయన ఉమ్మడి ఏపీలో పోస్టింగ్ తీసుకున్న ఆయన సైబరాబాద్ సీపీ కావటానికి ముందు చాలానే పదవుల్ని చేపట్టారు.
చాలా తక్కువ మంది ఐపీఎస్ అధికారులకు ఉన్న ఎన్ కౌంటర్ స్పెషలిస్టు ట్యాగ్ ఆయన సొంతం. కరుకైన నిర్ణయాలు తీసుకోవటంలో పేరున్న ఆయన.. అందుకు భిన్నంగా సింఫుల్ గా.. సున్నితంగా వ్యవహరిస్తారన్న పేరుంది.
సైబరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టి దాదాపు మూడేళ్లకు పైనే అయ్యింది. ఒక లెక్క ప్రకారం సైబరాబాద్ సీపీగా వ్యవహరించిన వారిలో ఒకరిద్దరు మాత్రమే ఇంతకాలం పని చేశారని.. అందులో సజ్జన్నార్ ఒకరని చెబుతారు.
తన మూడున్నరేళ్ల కాలంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకోవటంతో పాటు.. సైబరాబాద్ కమిషనరేట్ కు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చారని చెప్పాలి. దిశ ఎపిసోడ్ లో ఆయన తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చకు తెర తీసింది. ఆయనపై అభినందనల వర్షం కురిసింది.
సాధారణంగా సీపీ స్థానంలో రెండేళ్లకు మించి ఉంచరు.కానీ.. సజ్జన్నార్ ను మూడేళ్లకు పైనే ఉంచారు. తాజాగా ఆయన్ను బదిలీ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఆయన స్థానంలో సైబరాబాద్ కమిషనర్ గా 1999 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఆయన్ను ఏపీకి తీసుకెళ్లటానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ.. కేంద్రం అందుకు నో చెప్పటంతో ఉండిపోయారు.
అలాంటి ఆయనకు సైబరాబాద్ సీపీగాఅవకాశం దక్కటం ఆసక్తికరంగా మారింది. మరి.. సజ్జన్నార్ కు ఏ పోస్టు ఇచ్చారన్నది చూస్తే.. సీఎం కేసీఆర్ నిర్ణయం మరింత ఆసక్తికరంగా ఉందని చెప్పాలి.
ఆయన్ను ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకాలం పోలీస్ కమిషనర్ గా లా అండ్ ఆర్డర్ తో పాటు సైబర్ నేరాల అదుపు విషయంలో ప్రయత్నించిన సజ్జన్నార్ తన కొత్త పోస్టు విషయంలో ఎలా వ్యవహరిస్తారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
#Sajjanar gets grand farewell. pic.twitter.com/dn9zXvZlBE
— Siddhu Manchikanti Potharaju (@SiDManchikanti) August 25, 2021
https://twitter.com/rajashekhar4582/status/1430532838177198086