జగన్ పాలనకి తాలిబన్ల పాలనకి పెద్ద తేడా కనిపించడం లేదు.
పాలకులకు వ్యతిరేకంగా అక్కడా ఎవరూ నోరు విప్పలేరు.
ఇక్కడ కూడా ఎవరూ నోరు విప్పలేరు. నోరు విప్పితే ఏమవుతుందో దళిత డాక్టర్ సుధాకర్ ద్వారా అందరం చూశాం.
ఆ తర్వాత దళితులపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
దళిత మహిళ రమ్యశ్రీ హంతకుడికి వేసే శిక్ష రాబోయే తరాలు భయపడేలా గుర్తుండిపోయేలా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర మహిళ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జె.డి. మౌనిక . pic.twitter.com/DQBeYigCW5
— Uma Maheshwara Naidu M (@UmaMadineniTDP) August 21, 2021
ఇంత ప్రజాస్వామ్యం, కోర్టులు ఉన్నా కూడా ఏ ధైర్యంతో సామాన్యులపై దళితులపై దాడులు చేస్తున్నారన్నది అర్థం కాని పరిస్థితి. మొన్ననే దళిత యువతి రమ్య శ్రీపై జరిగిన అరాచకం చూశాం.
దిశ చట్టంతో 21 రోజుల్లో శిక్ష అన్నారు. అసలు ఆ చట్టమే కనిపించడం లేదు. సమీప భవిష్యత్తులో కూడా న్యాయంపై ఆశలేదు.
రమ్య తల్లిదండ్రులకు డబ్బు, ఉద్యోగం, ఇల్లు ఇచ్చి శాంతపరిచే ప్రయత్నం జరుగుతోంది గాని నిందితుడిని శిక్షించడానికి ప్రయత్నం జరగడం లేదు.
ఇంతలో మరో దారుణం జరిగింది. కర్నూలు జిల్లా మహానంది మండలం ఆర్ ఎస్ గాజుపల్లె గ్రామంలో రోడ్డు విషయంలో ఘర్షణ ఏర్పడింది. దళిత కాలనీ చెందిన వారు మాకు ఎందుకు రోడ్డు వెయ్యరు అని అడిగినందుకు వైస్సార్సీపీ కి చెందిన ధనుంజయుడు, శ్రీనివాసులు, ఆంజనేయులు, దళిత మహిళ పై దాడికి పాల్పడ్డారు అని తెలుగుదేశం పార్టీ ఆరోెపించింది. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయలు అయ్యాయి అంటున్నారు. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారట.
జగన్ రెడ్డి రాజ్యంలో దళితులను ఎలా అణచివేస్తున్నారో చెప్పడానికి ఇది ఉదాహరణ. రోడ్డు ఎందుకు వేయలేదన్న దళిత మహిళను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు వైసీపీ నేత. కర్నూలు జిల్లా, మహానంది మండలం, గాజుపల్లి గ్రామంలో జరిగింది ఈ ఘటన. దళితులు గళం విప్పితే కొట్టిస్తారా జగన్ రెడ్డి? ఇదేమి అన్యాయం? pic.twitter.com/c6kWcYO5SP
— Telugu Desam Party (@JaiTDP) August 24, 2021
ఇకనైనా ఈ దాడులు ఆగుతాయో లేదో. ఇంత అధికార మదం ఎందుకు?
పాపం ప్రభుత్వ ఉద్యోగులు అయితే తమకు జరుగుతున్న అన్యాయంపై కూడా నోరు విప్పలేకపోతున్నారు.
ఇంతకంటే దయనీయ పరిస్థితి ఇంకేముంటుంది?