మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు మరియు అభిమానుల సమక్షంలో తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే.
అయితే, ఈ సందర్భంగా విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియోలో అల్లు అర్జున్ లేకపోవడం చాలా మందిని విస్మయానికి గురిచేసింది. వీడియోలో అల్లు అరవింద్ మరియు అతని భార్య కనిపించారు కానీ మెగా కుటుంబంలో భాగమైన అల్లు సోదరులు.. అర్జున్, శిరీష్ మరియు బాబీ కనిపించలేదు.
ఇది ఒక వివాదం అయితే… మెగా కుటుంబాన్ని రాంగోపాల్ వర్మ మరోసారి తగులుకున్నారు.
మెగా ఫ్యామిలీపై వ్యంగ్యంగా ట్వీట్లు చేసే అవకాశాన్ని రామ్ గోపాల్ వర్మ ఎపుడూ వదులుకోడు. తాజా వరుస ట్వీట్లతో మెగా కుటుంబంపై పడ్డాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ గురించి సంచలన కామెంట్స్ చేశాడు. యాజ్ ఆఫ్ నౌ అల్లు అర్జున్ ఈజ్ ఓన్లీ మెగా స్టార్ అని వర్మ వ్యాఖ్యానించాడు.
అల్లు కుటుంబానికి మెగా కుటుంబానికి గొడవలు పెట్టేలా ఆర్జీవీ వ్యాఖ్యానించాడు. అల్లు అర్జున్ తెలివైన వాడు కాబట్టే పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదన్నారు. అల్లు అర్జున్ ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ అని కీర్తించాడు.
అక్కడితో ఆగితే బావుణ్ణు…. కానీ ఇతర మెగా హీరోలను పూచికపుల్లలా తీసిపడేశాడు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ వంటి పరాన్నజీవులు మాత్రమే ఆ వేడుకలకు హాజరయ్యారని RGV అన్నారు.
ఆర్జీవీ మాటలక మెగా అభిమానులు మండిపడుతున్నారు. వాస్తవానికి ఆర్జీవీ చేసింది తప్పే. ఆయనకు తాడూబొంగరం లేదు కాబట్టి ఇష్టానుసారం బతుకుతాడు. మెగా కుటుంబం అందరూ కలవడంలో కించిత్ తప్పులేదు. ఇలాంటి పనికిమాలిన కామెంట్ల వల్ల ఆర్జీవీ సాధించేదేం లేదు. మెగా కుటుంబం మరియు మెగా అభిమానుల మనసు గాయపరచడం తప్ప.
తన టైం అయిపోయింది కాబట్టి వెలుగులో ఉండటానికి ఇలాంటి పనికిమాలిన మార్గాలను ఎన్నుకోవడంలో అతను సిద్దహస్తుడు.
అయితే అల్లు అర్జున్ మాత్రం తన మావయ్యకు ఘనమైన శుభాకాంక్షలు తెలిపారు. మావయ్య కంటే తాను ఎపుడూ తక్కువే అనే భావన కలిగేలా ఉన్న ఒక పాత ఫొటోను జత చేసి శుభకాంక్షలు తెలిపారు.
Many many happy returns of the day to my and our one and only MEGASTAR CHIRANJEEVI garu . #HBDMegastarChiranjeevi pic.twitter.com/s5aWtE5aQl
— Allu Arjun (@alluarjun) August 22, 2021