• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైభవంగా జరిగిన డా. లకిరెడ్డి హనిమిరెడ్డి 80వ జన్మదినోత్సవ వేడుకలు!!

admin by admin
October 4, 2022
in NRI
0
0
SHARES
152
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం డా. లకిరెడ్డి హనిమిరెడ్డి 80వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ జనరల్ గౌరవనీయులు డా. టి . వి. నాగేంద్రప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరై డా. హనిమిరెడ్డి గారు చేసిన, చేస్తున్న ప్రజోపకరమైన కార్యక్రమాలు, వారి వితరణ ప్రవాస భారతీయులందరికీ ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఒక భారతీయుడిగానే కాకుండా, సాటి తెలుగువాడిగా కూడా తనకెంతో గర్వంగా ఉన్నదని, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియచేసారు.

ఉదయం సిలికానాంధ్ర కార్యవర్గం డా. హనిమిరెడ్డి, విజయలక్ష్మి దంపతులను వారి విడిది నించి గుఱ్ఱపు బగ్గీలో విశ్వవిద్యాలయానికి వేడుకగా తీసుకురాగా, అక్కడనించి పల్లకీలో, పూల వర్షం కురిపిస్తూ ఊరేగింపుగా భవనంలోకి తీసుకువచ్చారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధిపతి డా. కూచిభొట్ల ఆనంద్, చీఫ్ అకడమిక్ ఆఫీసర్ చమర్తి రాజు వారిని సాదరంగా భవనంలోకి ఆహ్వానించగా, భారత కాన్సులేట్ జనరల్ డా. టి . వి. నాగేంద్రప్రసాద్, డా. హనిమిరెడ్డి గారి విగ్రహాన్నీ, లోహ ఫలకాన్ని ఆవిష్కరించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ సరిగ్గా 6 సంవత్సారాల క్రితం ఇదే రోజున విశ్వవిద్యాలయ భవనం గృహప్రవేశం జరిగిందని, డా. హనిమిరెడ్డి గారి దాతృత్వం వల్లనే ఆ రోజున ఈ భవనం కొనుగోలు సాధ్యపడిందని సభికులకు గుర్తు చేశారు.

తొలుత సభ వేదపండితుల వేదాశీర్వచనాలతో ప్రారంభమయ్యింది. లివర్ మోర్ లోని శివ విష్ణు దేవాలయ ప్రధాన అర్చకస్వామి, మిల్ పిటాస్ లోని సత్యనారాయణ ఆలయ ప్రధాన అర్చకులు తమ, తమ దేవాలయాలకు డా.హనిమిరెడ్డి కుటుంబం చేసిన సేవలను కొనియాడారు. ఆ తరువాత కుమారి. తనుగుల ఈష ప్రార్ధనా గీతం పాడగా, కుమారి. అయ్యగారి అనఘ వయలిన్ వాద్య కచేరి చేసింది. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు మాధవపెద్ది మూర్తి గారు చేసిన నృత్యం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం డా.హనిమిరెడ్డి, విజయలక్ష్మి దంపతులను వేదిక మీదకు ఆహ్వానించి, వారికి ఘనసన్మానం చేసి, డా.హనిమిరెడ్డి గారికి “సిలికానాంధ్ర శ్రీకర” అనే బిరుదు ప్రదానం చేశారు. వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేకంగా చేయించిన కేక్ కోయించి, సభికులందరికీ అందజేశారు.

కాలిఫోర్నియా రాష్ట్రం నించి అమెరికా కాంగ్రెస్ కు ఎన్నికైన కాంగ్రెస్ మాన్ రో ఖన్నా, కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా, కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ సభ్యుడు డేవ్ కార్టజ్ లు వారికి తమ కార్యాలయాల ద్వారా శుభాకాంక్షలు,మరియు వారి దాతృత్వానికి ప్రశంసాపత్రాలు పంపారు. అలానే సభకు హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డా. రఘునాథ్ రెడ్డి, కిరణ్ ప్రభ, కొండిపర్తి దిలీప్ ప్రభృతులు వారితో తమ అనుబంధాన్ని పంచుకుంటూ వారి నించి ముఖ్యంగా అందరూ నేర్చుకోవాల్సినది సమాజం పట్ల బాధ్యత, వితరణశీలత అని పేర్కొన్నారు. డా.హనిమిరెడ్డి గారికి మరెందరో పుర ప్రముఖులు స్వయంగా, మరియు సందేశాలు పంపి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సిలికానాంధ్ర కార్యకర్తలు వారి కుటుంబసభ్యుల సహకారంతో సేకరించిన చిత్రాలతో, వీడియోలతో డా. హనిమిరెడ్డి గారి 80 ఏళ్ళ జీవన యానంలో ముఖ్య మైలురాళ్ళను చూపిస్తూ ప్రదర్శించిన AV సభికులను అలరించింది.

డా.హనిమిరెడ్డి మాట్లాడుతూ తనకు చెప్పడానికి మాటలు రావట్లేదని, అందరూ తనపై చూపిన ప్రేమ, అభిమానం తానెప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. చదువు అన్న మూడక్షరాలే ఎక్కడో భారతదేశంలోని ఒక పల్లెటూరులో పుట్టిన తనను ఇంతగా ఎదిగే అవకాశం కల్పించిందని, ఆ చదువు అందరికీ అందుబాటులోకి తేవడానికే, తాను ఎన్నో విద్యాసంస్థలకు దానధర్మాలు చేస్తూ తనవంతు సహాయం అందిస్తున్నానని సభికుల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. ఈ సభ విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యకర్తలు కందుల సాయి, కోట్ని శ్రీరాం, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, తనారి గిరి లకు డా.హనిమిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సభానంతరం అతిధులకు విందు భోజనం అందించారు.

100 వ పుట్టినరోజు వేడుకలను కూడా తాను మిలియన్ డాలర్లు దానం చేసిన డా.లక్కి రెడ్డి హనిమిరెడ్డి భవనంలోనే, సిలికానాంధ్ర కుటుంబ సభ్యుల మధ్యనే జరుపుకోవాలని ‘నమస్తే ఆంధ్ర’ కోరుకొంటోంది.

Tags: 80th birth day of dr hanimi reddy
Previous Post

జగన్ పాలనను ఏకేస్తూ జానపదం…వైరల్

Next Post

సీఐడీ పోలీసులకు వర్ల రామయ్య షాక్

Related Posts

Andhra

APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు

May 12, 2025
Andhra

తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా దివాకర్ రెడ్డి!

May 11, 2025
Andhra

అమరావతి రీలాంచ్: ప్రపంచ మీడియా దృక్కోణం!

May 3, 2025
Around The World

కాలిఫోర్నియాలో AIA ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు క్యాండిల్ లతో ఘన నివాళి

April 26, 2025
Andhra

జగన్ లిక్కర్ స్కామ్: నిందితుల జాబితా మరియు ఆరోపణలు!

April 22, 2025
Around The World

అమెరికా-భార‌త్ సంబంధాలు ద్రుఢ‌త‌రం-నిర్మలా సీతారామ‌న్‌!

April 22, 2025
Load More
Next Post

సీఐడీ పోలీసులకు వర్ల రామయ్య షాక్

Latest News

  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
  • కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?
  • టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై
  • ఎమ్మెల్యే వ‌ర్సెస్ లేడీ ఎంపీ.. నంద్యాల టీడీపీలో ఏం జ‌రుగుతుంది?
  • నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌
  • APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra