70 ఏళ్ల వయసున్న చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. 50 ఏళ్ల వయసున్న జగన్ సీఎంగా ఉన్నారు. అయితే.. వీరిలో ఎవరు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు? ఎవరు ఫ్యూచర్ కోసం.. ఆలోచిస్తున్నారు. ? ఎవరు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు? ఎవరు రాష్ట్రం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నారు? అంటే.. నిర్మొహమాటంగా పార్టీలకు అతీతంగా నెటిజన్లు చెబుతున్న మాట చంద్రబాబు నాయుడనే. ఈ విషయంలో మరో మాటే లేదని కూడా అంటున్నారు.
వాస్తవానికి యువ సీఎంగా జగన్‌కు ఎంతో చేసేందుకు స్కోప్ ఉంది. రాష్ట్రంలోనే కాకుండా.. విదేశీ పర్యట నలు కూడా చేసి.. రాష్ట్రానికి అవసరమైన అన్నింటినీ సాధించేందుకు కూడా ఆయనకు అవకాశం ఉంది. కానీ, ఆయన అడుగు కదపే పరిస్థితి లేదనే విషయం తెలిసిందే. కేవలం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా.. 19 సార్లు విశాఖకు వచ్చారు. హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు నగరంలోనే నాలుగు రోజులు ఉంది.. పరిస్థితిని సమీక్షించారు.
ఇక, ఇతర జిల్లాల్లోనూ ఆయన ఇలానే తిరిగారు. ఇక, పోలవరం విషయంలో అయితే.. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని సమీక్షించారు. 43 సార్లు ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఇక్కడ పనులను తెలుసుకునేవారు. ఇక, అమరావతి నిర్మాణాల కోసం.. సింగపూర్‌కు కూడా నాలుగు సార్లు వెళ్లారు. దుబాయ్‌కి రెండు సార్లు వెళ్లారు. ఇలా.. రాష్ట్రానికి ఏ అవసరం ఉంటుందో ముందుగానే గమనించి.. దానిని సాకారం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.
కానీ, ప్రస్తుత సీఎం జగన్ మాత్రం ఇంటికే పరిమితం అవుతున్నారనేది నెటిజన్ల అభిప్రాయం. తాజాగా చంద్రబాబు విశాఖలో రెండున్నర కిలో మీటర్ల దూరాన్ని జాతీయ జెండా పట్టుకుని నడిచిన నేపథ్యంలో ఈ తరహా.. చర్చ తెరమీదికి రావడం గమనార్హం. 70లో ఉన్న చంద్రబాబు కన్నా 50లో ఉన్న జగన్ ఎంతో చేయొచ్చని, కానీ, చంద్రబాబు ముందు జగన్ తేలిపోతున్నారని..నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.