అమెరికాలోని మినియాపోలిస్ నగరములో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా 5వ మహానాడు కార్యక్రమము అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి యన్.ఆర్.ఐ.యు.ఎస్.ఎ.విభాగం కో- ఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిధులుగా మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు,మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి,కీ.శే.నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జయరాం కోమటి మాట్లాడుతూ, విశాఖలో అవినీతి సామ్రాజ్యం నిర్మించటానికి అమరావతిని సమాధి చేయడం మంచిది కాదన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకుంటారా అని సాక్షత్తూ ముక్యమంత్రే భావోద్వేగాలు రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. గత వారం రోజులుగా మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు స్పందన కనిపించలేదు. ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగారన్నారు. దేవుళ్ళకు ప్రాంతాలకు అంటగడుతూ ఉత్తరాంధ్ర ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదన్నారు.
మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలన,ఎమర్జెన్సీ రోజులను జగన్ రెడ్డి గుర్తుకు తెస్తున్నారు. రాజంగాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్య విలువలను మంట కలుపుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థపై దాడి చేయటం సహేతుకం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గాని,శ్యాసనసభకు గాని రాజధానిని మార్చే హక్కు మూడు రాజధానులు ఏర్పాటు చేసే అధికారం లేదు. జగన్ రెడ్డి తుగ్లక్ చర్యలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి.న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పును అమలు చేయాలనీ,అమరావతి రైతులు తమ న్యాయమైన హక్కుల కోసం పాదయాత్ర చేస్తున్నారు. రైతులను అవహేళన చేయటం మంచిది కాదన్నారు.తన రాజకీయ వికృత క్రీడతో ఉత్తరాంధ్ర ప్రజలను సమిధులుగా మార్చవద్దున్నారు. ప్రజా కంఠకుడిగా చరిత్రలో మిగిలిపోకూడన్నారు.జగన రెడ్డి తన మూర్ఖపు నిర్ణయాలు మార్చుకొని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలన్నారు.
మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, మూడేళ్ళలో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నేరాలు – ఘోరాలు,ధరల పెంపుతో ప్రజలను దోచుకున్న విధానాలు,పెంచిన పన్నులతో వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు. ప్రజల దృష్టిని మార్చేందుకు 3 రాజధానుల బిల్లును జగన రెడ్డి తీసుకొస్తున్నారు.అసెంబ్లీ సాక్షిగా జగన రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. ప్రజాస్వమ్య దేవాలయం లాంటి అసెంబ్లీలో వాస్తవ గణాంకాలను మరుగున పెట్టి తప్పుడు లెక్కలు చెప్పడం జగన్ రెడ్డికే చెల్లిందన్నారు. జగన రెడ్డికి దోచుకోవడానికి ఏ ప్రాంతాలు లాభసాటిగా ఉంటాయి?ఆ ప్రాంత ప్రజల దృష్టిని ఎలా మరల్చాలి?తన నిర్ణయాలను వ్యతిరేకించిన వారిని ఎలా హింసించాలి తప్ప రాష్ట్ర అభివృద్ధిపై అవగాహన లేకుండా 3 రాజధానులు అంటున్నారని అన్నారు.
ప్రవాసాంధ్రుడు సాయి బొల్లినేని మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడుని తిరిగి అధికారంలోకి తీసుకు రావటమే ప్రవాసాంధ్రుల లక్ష్యమన్నారు. అందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం సాంకేతిక విద్యపై తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల మేమంతా ఈ స్థాయికి ఎదిగామన్నారు.
సమావేశములో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని.భావోద్వేగాలు-ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతున్న ముఖ్యమంత్రి,రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని, క్షణిస్తున్న శాంతిభద్రతలు – ఆగని వేధింపులు -అక్రమ అరెస్టులు మరియు సభ్యత్వ నమోదు-పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర తీర్మానాలను చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించటమైనది.
300 వందలకు పైగా హాజరైన ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొనడం విశేషం.
ఈ కార్యక్రంలో యన్.ఆర్.ఐ తెలుగుదేశం సభ్యులు రామ్ వంకిన, వెంకట్ జువ్వ, వేదవ్యాస్ అరవపల్లి, అజయ్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.
Comments 1