10 ఏళ్లుగా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్…
ఇప్పటితో, 1956 లో ఏర్పడ్డ బంధానికి పూర్తిగా వీడ్కోలు…
1591 నుంచి నిజాం పాలనలో హైదరాబాద్ రాజధాని…
భాగ్యనగరం లో అనేక అద్భుత చారిత్రక కట్టడాల తో గోల్కొండ ఖిల్లా రాజ్యం గా కొనసాగింది…
జంట నగరాలు, మూసీ నది పరవళ్ళతో 1769 నుంచి 1948 వరకూ కొన్నాళ్ళు మొఘలులు ఎక్కువ కాలం నిజాం పాలనలోనే హైదరాబాద్..
1948 లో హైదరాబాద్ సంస్థనాన్ని భారత్ లో కలపడం..
పొట్టి శ్రీములు ప్రాణత్యాగం మద్రాస్ స్టేట్ నుంచి విడివడ్డ ఆంధ్ర కి కర్నూల్ రాజధాని గా జరిగిన నిర్ణయం..
భాషా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలను కలిపి హైదరాబాద్ ను రాజధానిగా అంగీకారం…
58 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల హక్కుని మాత్రమే సాధించుకున్న AP…
10 ఏళ్లుగా తనని తాను నిర్మించుకోలేక రాజకీయ గాయాలతో నలుగుతున్న ఆంధ్ర..
అభివృద్ధి సంగతి దేవుడు ఎరుగు.. కనీసం అడ్రస్ లేని రాజధాని…
రాష్ట్రం పట్ల ప్రేమ, నిబద్దత, నా రాష్ట్రం, నా ప్రజల అభివృద్ధి అన్నది మరచిన నాయకులు…
కేంద్ర సంస్థల కొరత, కొత్త కంపెనీల ఆశలు, ఇవన్నీ అందని ద్రాక్షలు గా ఎందుకు మారాయి…
ప్రజాచైతన్యం కొరవడిందా, ప్రశ్నించే తత్వం సన్నగిల్లిందా..సరైన నాయకుల ఎంపిక లోపమయ్యిందా..?
ఎన్నికల కోడ్ అడ్డమో… రాజకీయమే అడ్డమో.. తెగిపోయే ఈ బంధం పై నోరువిప్పని నాయకులు..
10 ఏళ్ల దశాబ్ది ఉత్సవాలతో తెలంగాణాలో సంబురాలు…
10 ఏళ్ల తర్వాత కూడా అడుగు ముందుకు పడని రాష్ట్రం గా ఆంధ్ర….
ఆంధ్ర ప్రజల తెలివి, తెలంగాణ ప్రజల తెలివి ముందు చిన్నబోయిందా..?
విడిపోయి కలిసుందామన్న తెలంగాణ గొప్ప భావం నిలబడింది..
విడిపోయి నిలబడగలం అన్న AP ధైర్యం చిన్నబోయింది…
మరి కొన్నేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలా…?
తెలుగు ప్రజలు ఏమి కోరుకుంటారు…? తెలుగు ప్రజలు ఏమి నిర్ణయిస్తారు…..