సంచలనం రేకెత్తిస్తున్న, పలు విషాదాలకు ఆనవాలుగా మిగిలిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యోదంతంపై టీడీపీ కొన్ని ప్రశ్నలు గుప్పించింది. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ విడుదల చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ నడవడిపై మొదట్నుంచి అనుమానాలు ఉన్నాయని అంటోంది. అదేవిధంగా గతంలో రౌడీ షిట్ కూడా ఒకటి నమోదు అయి ఉందని, దాన్ని వైసీపీ అధికారంలోకి రాగానే 2019లోనే తొలగించారని కూడా చెబుతోంది. తాజా ప్రశ్నలకు సంబంధించి అధికార పక్షం నేతలు ఏమంటారో చూడాలిక !
మొదటి ప్రశ్న : అనంతబాబుపై రెండు రోజుల దాకా కేసు ఎందుకు పెట్టలేదు?
రెండో ప్రశ్న : తోస్తేనే చనిపోతారా ? చనిపోయిన తరువాత కొట్టారని ఎలా చెబుతారు. ?
మూడో ప్రశ్న : అనంత బాబు ఒక్కడే హత్య చేయగలడా ? మిగతా వాళ్ల సంగతేంటి ?
నాలుగో ప్రశ్న : అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో గొడవ జరిగినట్టు దృశ్యాలు లేవు కదా ? అంటే ఎస్పీ చెప్పింది అబద్ధమే కదా!
ఐదో ప్రశ్న : చంపినోడి మాటలే నమ్మి, మీడియాకు అదే వాస్తవం అని ఎలా చెప్తారు ?
ఇవీ టీడీపీ అడుగుతున్న ప్రశ్నలు. బాధిత వర్గాలు మాత్రం తమకు న్యాయం దక్కే వరకూ పోరాటం చేస్తామనే అంటున్నాయి.
దళిత సంఘాలు కూడా వీరికి బాసటగానే ఉన్నాయి. సీన్లోకి సీఎం వచ్చి, నిజాలు తెలుసుకుని నిందితులకు కఠిన శిక్షలు వేస్తారనే భావిస్తున్నామని డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అంటున్నారు.
మరోవైపు బాధితవర్గం వెర్షన్ ఈ విధంగా ఉంది :
వాస్తవానికి ఘటన జరిగిన రోజు నుంచి అనంత బాబు పరారీలో ఉన్నారు. ఆయన జాడ లేదు అని పోలీసులు చెబుతూ ఐదు దర్యాప్తు బృందాలను గాలింపు చర్యల నిమిత్తం నియమించారు. ఆఖరికి తేలిందేంటంటే ఆయన కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే పెళ్లిళ్లకు హాజరవుతూ కెమెరా కన్నుకు చిక్కిపోవడం.
ఇదే సమయంలో అనంతబాబు తరఫున వైసీపీ పెద్దలు రంగంలోకి దిగిmరెండు కోట్లకు డీల్ కుదుర్చుకునేందుకు బాధిత వర్గాలతో మాట్లాడడం. కానీ ఇందుకు బాధిత వర్గాలు ఒప్పుకోక పోవడం, ఇవన్నీ అనంత బాబు అరెస్టు డిలే కావడానికి ప్రభావితం చేసే విషయాలే కావొచ్చు అని అంటోంది బాధిత వర్గం.