అనూహ్య విషాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ వన్ వద్ద పైకప్పునకు సపోర్టుగా పెట్టే ఫిల్లర్ కూలిపోవటం.. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. పలువురు గాయపడ్డారు. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఢిల్లీ విమానాశ్రయం లోని టెర్మినల్ వన్ లో చోటు చేసుకున్న ఈ ప్రమాదం పలువురిని అలెర్ట్ చేసింది.
ఈ షాక్ నుంచి పూర్తిగా బయటపడని వేళ.. మరోసారి కేంద్రంలోని మోడీ సర్కారు ఫెయిల్యూర్ తనాన్ని కళ్లకు కట్టినట్లుగా చెబుతున్నారు. ఇదే సందర్భంలో ఉగ్రవాదుల అధిపత్యం కశ్మీర్ లోయలో సాగుతోందన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా ఒక విపత్తు విరుచుకుపడింది. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాక్ లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో న్యోమా చుషుల్ ప్రాంతంలో భారత సైన్యాన్ని సైనిక విన్యాసాలు చేపట్టారు.
ఇదిలాఉంటే.. ఈ ప్రాంతంలోకి అకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో ఐదుగురు జవాన్లు ప్రాణాల్ని కోల్పోయారు. లేహ్ కు 148 కి.మీ. దూరంలోని బోధి నదిలో నగరంలో ఈ తెల్లవారుజమున జరిగింది. విన్యాసాల్లో భాగంగా.. భారీ యుద్ధ ట్యాంక్ నదిని దాటుతున్న వేళలో ఈ వరదలు విరుచుకుపడ్డాయి. చూస్తుండగానే నీటి ప్రవాహ వేగం పెరిగింది. దీంతో టీ72 ట్యాంక్ మునిగిపోయింది.
వెంటనే స్పందించిన సైన్యం.. నదిలో కొట్టుకు పోయిన ఐదుగురిని కాపాడేందుకు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాద ఘటనపై కేంద్ర రక్షన మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్యాంక్ నది దాటుతుండగా ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుందని.. ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవటం విచారకరమని పేర్కొన్నారు. దేశం కోసం మన సైనికుల అపార సేవలను ఎప్పటికి మర్చిపోలేమన్న ఆయన.. మరణించిన వారి కుటుంబాల వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.