40 లక్షల రూపాయలు.. ఔను.. 40 లక్షల రూపాయల వ్యవహారం.. వైసీపీ లేడీ మినిస్టర్‌కు సెగ పెడుతోం ది. ఎక్కడికి వెళ్లినా.. ఏం చేస్తున్నా.. ఆమెకు ఇదే కనిపిస్తోంది. నియోజకవర్గంలోనూ ఇదే వినిపిస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక.. సదరు మంత్రి నియోజకవర్గం మొహం కూడా చూడడం లేదని అంటు న్నారు. రాయలసీమ జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మహిళా నేత.. గతంలో టీడీపీలోనూ ఉన్నారు. ఆ పార్టీతో విభేదించి.. వైసీపీ జెండా పట్టుకున్నారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక, రెండో సారి మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు సీఎం జగన్ మంత్రి పదవి ఇచ్చారు. అయితే.. ఆమె కుటుంబం కూడా.. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలో మంత్రికి తెలియకుండా.. ఆమె సోదరుడు ఒకరు.. స్తానిక వైసీపీ మహిళా కౌన్సిలర్‌కు.. పదవిని ఆశచూపా రట. మునిసిపల్ చైర్పర్సన్ పదవి ఇప్పిస్తానంటూ.. మూడు దఫాలుగా మొత్తం 40 లక్షలు తీసుకున్నా రు. ఈ విషయాన్ని ఇటీవల ఆమే వెల్లడించారు.