హింసించే 24వ రాజు జగన్ రెడ్డి… మన భవిష్యత్తు కోసం ఒక మూర్ఖుడితో పోరాడుతున్నాం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. 300 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా లోకేష్ ఈరోజు అమరావతిలో పలుచోట్ల ఉద్యమాల్లో పాల్గొన్నారు.
ఎంతో విజన్ తో రాష్ట్ర పాలనకు అవసరమైన సంపదను సృష్టించే కేంద్రంగా, వనరుల నగరంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో చంద్రబాబు హయాంలో ఏపీ ప్రభుత్వం అమరావతి నగరానికి అంకురార్పణ చేసింది. అమరావతి నుంచి రాజధానిని తరలించాలన్న నిర్ణయంతో రెండు జిల్లాలే కాదు ఏపీ మొత్తం తీవ్రంగా ప్రభావితం అయ్యింది.
తన రాజకీయ కారణాలతో సీఎం జగన్ రెడ్డి అమరావతి కలను విచ్చిన్నం చేశారు. 3 రాజధానులు అంటూ అసంబద్ధమైన ప్రతిపాదన తెచ్చారు. దీంతో అమరావతికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన 30 వేల మంది రైతులు మాత్రమే కాదు, రాజధానిలో మాకు ఇల్లు ఉండాలని అక్కడ చిన్న చిన్న స్థలాలు కొన్ని లక్షలాది ఆంధ్రాజనం అన్యాయం అయిపోయారు.
అమరావతి రైతులు మొదలుపెట్టిన ఉద్యమం 300 రోజులకు చేరడంతో నారా లోకేష్ అమరావతి ఉద్యమంలో పాల్గొని ఈరోజు అక్కడ పలు గ్రామాల్లో పర్యటించారు. వారికి భరోసా ఇచ్చారు. జగన్ మాటతప్పడంలో, మడమ తిప్పడంలో వెనక్కు తగ్గడన్నారు.
అరెస్టులు, అవమానాలు, నిర్బంధాలున్నా… ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్న రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభిమవందనాలు అంటూ నారా లోకేష్ అన్నారు.